రాహుల్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారు | Rahul Gandhi Tour Scheduled in Telangana | Sakshi
Sakshi News home page

రాహుల్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

May 1 2022 3:34 AM | Updated on May 1 2022 3:48 AM

Rahul Gandhi Tour Scheduled in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ దాదాపు ఖరారైంది. గత రెండు రోజులుగా ఈ షెడ్యూల్‌ ఖరారుపై కస రత్తు చేస్తున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు దానికి తుది రూపునిచ్చారు. ఈ తాత్కా లిక షెడ్యూల్‌ను అనుమతి కోసం ఢిల్లీలోని రాహుల్‌ గాంధీ కార్యాల యానికి పంపారు. గాంధీ భవన్‌ వర్గాల సమాచారం ప్రకారం మే 6వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్‌ గాంధీ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5:30 గంటల నుంచి 6:30 వరకు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. ప్రధాన వేదికపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఇతర ముఖ్య నేతలు ప్రసంగిం చిన తర్వాత సాయంత్రం 7 గంటలకు రాహుల్‌ ప్రసంగం ఉంటుంది. దాదాపు 40 నిమిషాల ప్రసంగం తర్వాత రాత్రి 8 గంటలకు వరంగల్‌ నుంచి రాహుల్‌ రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. దుర్గంచెరువు సమీపంలోని కోహినూర్‌ హోటల్‌లో ఆయన రాత్రి బస కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 

7న రాజీవ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌కు శంకుస్థాపన
రాహుల్‌ రెండో రోజు షెడ్యూల్‌ బిజీబిజీగా సాగ నుంది. 7వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అల్పాహారం, లంచ్‌ సమయాల్లో కూడా రెండు వీఐపీ బృందా లతో రాహుల్‌ సమావేశమయ్యేలా షెడ్యూల్‌ రూపొందించారు. తెలంగాణ అమరవీరుల కుటుం బాలకు పరామర్శ, తెలంగాణ ఉద్యమకారులతో, రాష్ట్రంలోని పలువురు ప్రముఖులతో భేటీ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బోయిన్‌పల్లిలో కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించిన భూమిని కూడా రాహుల్‌ సందర్శించనున్నారు. అక్కడ రాజీవ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా పనిచేసిన పార్టీ కార్యకర్తలను రాహుల్‌ కలవనున్నారు. వారితో ఫొటో సెషన్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక రాహుల్‌ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే ఒక రకంగా, లేదంటే మరో రకంగా షెడ్యూల్‌ రూపొందించారు. అయితే ఆయన ఉస్మానియాకు వెళ్లే కార్యక్రమం దాదాపు రద్దయినట్టు తెలుస్తోంది. కాగా సాయంత్రం 4 గంటల తర్వాత శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్‌ 5:30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరిగి వెళతారు. ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్‌పై పూర్తి స్పష్టత వస్తుందని, అవసరమైతే ఒకట్రెండు మార్పులు తప్ప దాదాపు ఇదే షెడ్యూల్‌ ఉంటుందని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. 

ఏర్పాట్లు పరిశీలించిన నేతలు 
సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రాహుల్‌ సభకు ఏర్పాట్లు మొదలయ్యాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, కార్యదర్శులు శ్రీనివాసన్‌ కృష్ణన్, బోస్‌ రాజు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్, ఇతర సీనియర్‌ నేతలతో కలిసి వరంగల్‌లో పర్యటించారు. 6వ తేదీన హనుమ కొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభ కోసం వేదికల ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఫాతిమా నగర్‌ సెయింట్‌ గ్యాబ్రియల్‌ స్కూల్‌ మైదానంలో హెలిపాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాణిక్యం ఠాగూర్‌ మీడియాతో మాట్లాడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement