అధికారులకు దిమ్మతిరిగే షాక్‌.. వైరల్‌ వీడియో | Protest With Garbage In Front Of Mahabubabad Municipal Office | Sakshi
Sakshi News home page

అధికారులకు దిమ్మతిరిగే షాక్‌.. వైరల్‌ వీడియో

Apr 16 2026 10:32 AM | Updated on Apr 16 2026 10:54 AM

Protest With Garbage In Front Of Mahabubabad Municipal Office

సాక్షి, మహబూబాబాద్‌: పట్టణంలోని 21వ వార్డుకు రెండు వారాలుగా మున్సిపల్‌ వాహనం రావడం లేదని దాంతో వార్డులో దుర్వాసన వెదజల్లుతుందని కౌన్సిలర్‌ జరీనా బేగం పేర్కొన్నారు. 21వ వార్డులోకి వాహనం రాకపోవడంతో స్థానికులు బుధవారం చెత్తతో వార్డు కౌన్సిలర్‌ ఇంటికి వెళ్లారు. దాంతో కౌన్సిలర్‌ జరీనాబేగం చేసేది ఏమీ లేక వారిని, వారు తీసుకొచ్చిన చెత్తతో మున్సిపాలిటీ కార్యాలయం వెళ్లారు.

ఆ సంచులను కార్యాలయంలో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్‌ జరీనా బేగం మాట్లాడుతూ.. డ్రైవర్‌ లేరని, వాహనాలు మరమ్మతులు ఉన్నాయని 45 రోజులుగా అధికారులు చెబుతున్నారన్నారు. రెండు వారాలుగా వాహనం రావడం లేదని అంతకుముందు కూడా వార్డు మొత్తం కాకుండా వార్డులో సగం మాత్రమే చెత్త సేకరించేవారని తెలిపారు.

ఆ సమస్యను వార్డు వాసులతో కలిసి కమిషనర్‌ రాజేశ్వర్, చైర్మన్‌ గుగులోత్‌ జ్యోతికి వివరించారు. దీంతో వాహనాలు మరమ్మతులో ఉన్నాయని.. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మరో వార్డుకు కేటాయించిన ట్రాక్టర్‌ను 21వ వార్డుకు పంపించారు. కార్యక్రమంలో వార్డు వాసులు రవి, వీరన్న, ముక్తియార్, ఈసూఫ్, అస్లాం, జిలాని, జాకీర్, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement