లిఫ్ట్‌లో ఇరుక్కుంటున్నారు.. సర్వేలో ఆసక్తికర విషయాలు

Points of Interest in Local Circles Institutional Survey about Lifts - Sakshi

గత మూడేళ్లలో తాము లేదా తమ కుటుంబ సభ్యులు లిఫ్ట్‌లో చిక్కుకున్నట్టు 58 శాతం మంది వెల్లడి

లిఫ్ట్‌ మెయింటెనెన్స్‌కు థర్డ్‌ పార్టీ సేవలు వినియోగిస్తున్న 42 శాతం మంది

తమ అపార్ట్‌మెంట్లలో లిఫ్ట్‌లకు మెయింటెనెన్స్‌ లేదని 5 శాతం మంది వెల్లడి

లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ సర్వేలో ఆసక్తికర అంశాలు

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల కాలంలో బహుళ అంతస్తుల భవనాలు పెరిగాయి. గేటెడ్‌ కమ్యూనిటీల్లో 20 ఫోర్లకు పైనే నిర్మిస్తున్నారు. అపార్ట్‌మెంట్లలోనే కాకుండా ఇల్లు, కార్యాలయం, షాపింగ్‌ మాల్స్, ఫ్యాక్టరీలు ఇలా ఎక్కడయినా.. మెట్లపైనుంచి నడిచివెళ్లే వారికంటే.. లిఫ్ట్‌ ఎక్కడుందా అని వెతికేవారే ఎక్కువ. బహుళ అంతస్తుల భవనాల్లో ఇళ్లలో ఉండేవారు, కార్యాలయాల్లో పనిచేసేవారు వయసుతో సంబంధం లేకుండా దాదాపు ప్రతినిత్యం లిఫ్ట్‌లు వాడుతూనే ఉన్నారు.

అయితే ఇటీవల లిఫ్ట్‌లు పనిచేయక అందులో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఆగస్టు 3న ఢిల్లీలోని నోయిడా సెక్టార్‌ 137లో జరిగిన ఓ ఘటనలో 70 ఏళ్ల వృద్ధురాలు 45 నిమిషాలపాటు లిఫ్ట్‌లో ఇరుక్కుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు ప్రాణాలు కోల్పోయారు. లిఫ్ట్‌ వాడకం అన్నది నిత్య జీవితంలో భాగమైంది.

అయితే లిఫ్ట్‌ వాడకం, దాని నిర్వహణ తదితర అంశాలపై లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ దేశవ్యాప్తంగా 329 జిల్లాల్లో 42 వేల మందిని సర్వే చేసింది. ఇందులో 61 శాతం మంది పురుషులు, 39 శాతం మంది మహిళలు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గత మూడేళ్లలో తమ గృహ సముదాయంలో లేదా కార్యాలయంలో తాము కానీ, తమ కుటుంబ సభ్యులు కానీ లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇబ్బందిపడ్డారని 58 శాతం మంది అభిప్రాయం వెల్లడించారు.  

లిఫ్ట్‌ల నిర్వహణపై ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలు నిర్ణయించాలా?  
కచ్చితమైన నిబంధనలు రూపొందించాలి 76 శాతం మంది  
అలా చేయడం వల్ల సమస్యలు పెరుగుతాయి... అమలు కూడా సాధ్యం కాదు 24 శాతం మంది  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top