జూబ్లీహిల్స్‌లో హిట్ అండ్ రన్  | One Died Road Accident at Jubilee Hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం..

Jan 24 2024 11:27 AM | Updated on Jan 24 2024 3:53 PM

One Died Road Accident at Jubilee Hills - Sakshi

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దమ్మగుడి వద్ద బైక్‌పై వెళుతున్నవ్యక్తిని అతివేగంగా వచ్చిన ఢీకొట్టింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని, పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ పబ్‌లో బౌన్సర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. బైక్‌పై వెళ్తున్న వారిని డీకొట్టి కారుతో సహా నిందితుడు పరారైనట్లు చెప్పారు. ప్రమాదంలో తారక్‌ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.  అతడికి ఏడాది క్రితమే పెళ్లి జరిగినట్టు సమచారం. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement