1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ | Notification for 1284 Lab Technician Posts | Sakshi
Sakshi News home page

1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

Sep 12 2024 4:47 AM | Updated on Sep 12 2024 4:47 AM

Notification for 1284 Lab Technician Posts

ఈ నెల 21 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ.. అక్టోబర్‌ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు

నవంబర్‌ 10న రాతపరీక్ష..అభ్యర్థులు ఎక్కువగా ఉంటే..రెండుమూడు సెషన్లు.. మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కార్యదర్శి గోపికాంత్‌రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: వైద్య,ఆరోగ్యశాఖలో 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌–2 పోస్టుల భర్తీకి మెడికల్‌ హెల్త్‌ సర్విసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్‌ ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువు విధించారు. 

దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని ఎడిట్‌ చేసుకునేందుకు అదే నెల ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకు అవకాశం కల్పించారు. నవంబర్‌ 10వ తేదీన కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఉంటుందని గోపీకాంత్‌రెడ్డి వెల్లడించారు. వయో పరిమితి 46 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే రాత పరీక్షలు రెండు, మూడు సెషన్లో నిర్వహిస్తారు. పరీక్ష పేపరు ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. 

» మొత్తంగా 1,284 పోస్టులుండగా, అందులో 1,088 ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) విభాగంలో, మరో 183 తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో, మరో 13 హైదరాబాద్‌ ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఉన్నాయి.  
»    ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ), వైద్య విధాన పరిషత్‌ విభాగంలోని పోస్టులకు పేస్కేల్‌ రూ.32,810– రూ.96,890.  
» ఎంఎన్‌జే ఆస్పత్రిలోని పోస్టులకు పేస్కేల్‌ రూ.31,040–రూ.92,050.   

ముఖ్యాంశాలు...
»అన్ని పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల పరీక్ష కేంద్రాలుంటాయి. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.  
» ఆన్‌లైన్‌ పరీక్ష ఫీజు రూ.500, ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200 
»   మెరిట్‌ జాబితాను బోర్డు వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు.  
»   విద్యార్హతలు: అభ్యర్థులు ల్యాబ్‌ టెక్నిïÙయన్‌ కోర్సు చేసి ఉండాలి. ఎంఎల్‌ ఒకేషనల్, ఇంటర్మీడియట్‌లో ఎంఎల్‌ ఒకేషనల్‌ చేసి ఒక ఏడాది క్లినికల్‌ శిక్షణ పొందిన వారూ అర్హులే. డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నిïÙయన్‌ కోర్సు(డీఎంఎల్డీ), బీఎస్సీ (ఎంఎల్‌), ఎంఎస్సీ (ఎంఎల్టీ), డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ (క్లినికల్‌ పాథాలజీ) టెక్నిïÙయన్‌ కోర్సు, బ్యాచిలర్‌ ఆఫ్‌ మెడికల్‌ ల్యా»ొరేటరీ టెక్నాలజీ(బీఎంఎల్టీ) పీజీ డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యా»ొరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమో ఇన్‌ క్లినికల్‌ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ(మైక్రోబయాలజీ), ఎంఎస్సీ (మైక్రోబయాలజీ) ఎంఎస్సీ ఇన్‌ మెడికల్‌ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్‌ క్లినికల్‌ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్‌ బయోకెమిస్ట్రీ చేసినవారు ఈ పోస్టులకు అర్హులు 
»   పోస్టుల నియామక ప్రక్రియ వంద పాయింట్ల ప్రాతిపదికగా భర్తీ చేస్తారు. రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజీ కింద కలుపుతారు. అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తే వెయిటేజీ కింద 20 పాయింట్లు కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో కనీసం ఆరు మాసాలకు పైగా వైద్యసేవలందిస్తే 2.5 పాయింట్లు కేటాయిస్తారు. గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతీ ఆరు నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. కనీసం ఆరు నెలలు పనిచేస్తేనే వెయిటేజీ మార్కులొస్తాయి.  
»   నోటిఫికేషన్‌ విడుదలయ్యే నాటికి వెయిటేజీ కటాఫ్‌ తేదీగా నిర్ణయించారు.  
»  కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ అభ్యర్థులు అనుభవపూర్వక ధ్రువీకరణపత్రాన్ని వారు విధులు నిర్వర్తిస్తున్న ఆస్పత్రుల నుంచే తీసుకోవాలి.  
»  మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఠీఠీఠీ.ఝజిటటb. ్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement