సాక్షి,నిజామాబాద్: ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని అవినీతిశాఖ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో చేపట్టిన సోదాల్లో నాలుగు ఇళ్లు,ఒక వాణిజ్య భవనం ఉన్నట్లు గుర్తించారు. 8 ఇళ్ల స్థలాలు,10.23 ఎకరాల భూమి,3.31లక్షల నగదు,ఖాతాలో 50 లక్షలు ఉన్నట్లు తేల్చారు.
మొత్తం మూడు కోట్లకుపైగా అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో స్థిరాస్తుల విలువ అధికంగా ఉంటుందని అధికారులు వివరించారు. నిజామాబాద్,సికింద్రాబాద్ మచ్చ బొల్లారం ఇళ్లతోపాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో మొత్తం 11 బృందాలు,11 చోట్ల ఉదయం నుంచి తనిఖీలు చేశాయి. సోదాలు ముగిసినప్పటికీ విచారణ మాత్రం కొనసాగుతుందని అనిశా అధికారులు వెల్లడించారు.


