ఫ్యూచర్‌ నెక్సెస్‌ సూపర్‌ సక్సెస్‌

Mulugu Forest College Priyanka Varghese Attending Road Show - Sakshi

ములుగు అటవీ కళాశాలలో రోడ్‌ షో హాజరైన ప్రియాంక వర్గీస్, సెంచూరియన్‌ యూనివర్సిటీ బృందం

ములుగు(గజ్వేల్‌): సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో ఒడిశా సెంచూరియన్‌ యూనివర్సిటీ సహకారంతో శనివారం ది ఫ్యూచర్‌ నెక్సెస్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ 4.0పై నిర్వహించిన రోడ్‌ షో విజయవంతమైంది. హైడ్రోఫోనిక్స్, బయో ఎరువులు, సేంద్రియ వ్యవసాయం, రిమోట్‌ సెన్సింగ్‌ అభ్యసన, ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాంలు, వివిధ నైపుణ్యాలు, డొమైన్‌ కోర్సుల గురించి అవగాహన కల్పించేలా స్టాల్స్‌ను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా గ్రీన్‌టెక్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధి అనే అంశంపై బెంగళూరు సున్మోక్ష పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అతుల్‌ బిహారీ భట్నాగర్‌ మాట్లాడారు. అనంతరం వ్యవసాయం, అటవీ రంగంలో డ్రోన్‌ ప్రయోజనాలు అర్థమయ్యేలా సెంచూరియన్‌ అధ్యాపకులు డ్రోన్‌ ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహిం చారు. ములుగు ఎఫ్‌సీ ఆర్‌ఐ డీన్, సీఎం కార్యాలయ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ మాట్లాడుతూ ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య, ఉద్యానవన వర్సిటీ రిజిస్ట్రార్‌ భగవాన్, ఉద్యానవన విశ్వ విద్యాలయ కంట్రోలర్‌ కిరణ్‌కుమార్, ములుగు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏడీఎస్‌ కిషన్‌రావు, సివికల్చర్‌ డీఎఫ్‌ఓ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్, గజ్వేల్, సిద్దిపేట తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యార్థులు, ఎఫ్‌సీఆర్‌ఐ విద్యార్థులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top