దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ  | Sakshi
Sakshi News home page

దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ 

Published Mon, May 22 2023 3:27 AM

Minister Puvwada Ajaykumar at Khammam Megajob Mela - Sakshi

ఖమ్మం మయూరిసెంటర్‌: దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. మరోపక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో మొదటి స్థానంలో నిలుస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. ఖమ్మంలోని ఎస్‌బీఐటీ కళాశాల ప్రాంగణంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళాను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు తిండి గింజల కోసం పక్క రాష్ట్రాలవైపు చూడాల్సిన పరిస్థితి ఉండగా.. నేడు సీఎం కేసీఆర్‌ పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ ముందుందన్నారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగం పొందలేరని, అలాంటి వారి కోసం జాబ్‌ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఖమ్మంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యాన 140 కంపెనీలతో 8,120 మందికి ఉద్యోగాలు ఇప్పించేలా జాబ్‌ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌తో పాటు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement