'ఇసుక' అనుమతులు వేగవంతం | Sakshi
Sakshi News home page

'ఇసుక' అనుమతులు వేగవంతం

Published Sat, Sep 9 2023 2:04 AM

Minister Mahender Reddy Review on Mines Department in Telangana State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటు ధరలో ఇసుకను అందించాలని అధికారులను గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆదేశించారు. పట్టా భూముల్లో ఇసుక వెలికితీతకు సంబంధించిన అనుమతులను వేగవంతం చేయాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖ ఉన్నతాధికా­రులతో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో అమల్లో ఉన్న మైనింగ్, క్వారీ లీజులు, రెవెన్యూ వసూలు తదితర అంశాలతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో గనుల శాఖ సాధించిన పురోగతిని పరిశీలించారు. ఖనిజాల బ్లాక్‌ల వేలానికి వీలుగా పర్యావరణ అనుమ­తులను వేగవంతం చేయాలని.. గనులు, చిన్న తరహా మైనింగ్‌ లీజులపై మరింత మంచి విధానం అమలు చేయాలని అధికారులకు సూచించారు.

లీజులో ఉండి పని నడవని గను­లను క్రియా­శీలం చేయాలని, జిల్లాల వారీగా మినరల్‌ రెవె­న్యూ పెంచాలని ఆదేశించారు. గనుల శాఖలో ఖాళీగా ఉన్న అధికారులు, సిబ్బందికి సంబంధించిన 127 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. గత ఏడేళ్లలో ఇసుక విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5,444 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. 

Advertisement
 
Advertisement