మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

Metro Stations Under Containment Zones Will Also Reopen  - Sakshi

తెరుచుకోనున్న ముషీరాబాద్, గాంధీఆస్పత్రి, భరత్‌నగర్‌ స్టేషన్లు 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ వాసుల కలల మెట్రో సేవలు గురువారం నుంచి ఉదయం 6.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్, అమీర్‌పేట్, మియాపూర్, ఎంజీబీఎస్‌ టర్మినల్‌ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 9.30 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు.

ఇక కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో ఉన్న ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి, భరత్‌నగర్‌ మెట్రో స్టేషన్లు సైతం గురువారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా ప్రస్తుతం మూడు మెట్రో మార్గాల్లో నిత్యం సుమారు 1.5 లక్షల మంది మెట్రో రైళ్లలో జర్నీ చేస్తున్న విషయం విదితమే. (చదవండి: త్వరలో సిటీలో డబుల్‌ డెక్కర్‌ సర్వీసులు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top