మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు | Men Cheated And Used Unmarried Girl In The Name Of Marriage | Sakshi
Sakshi News home page

మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు

Dec 8 2021 2:54 PM | Updated on Dec 8 2021 3:19 PM

Men Cheated And Used Unmarried Girl In The Name Of Marriage - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాయపర్తి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చాక కాదు పొమ్మంటున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది ఓ యువతి. ఏఎస్సై సదయ్య కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన ఉబ్బని రాజకుమారి(25) తల్లిదండ్రులు అనారోగ్యం కారణంగా మృతిచెందారు. ఈ క్రమంలో ఒక్కతే ఇంటివద్ద ఉంటుంది. మండలంలోని మైలారానికి చెందిన గబ్బెట శ్రీకాంత్‌కు రాజకుమారికి పరిచయం ఏర్పడింది. మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో గర్భం దాల్చింది. నవంబర్‌ 29న వర్ధన్నపేట సీహెచ్‌సీలో బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడు బాబుకు నాకు సంబంధం లేదు అంటూ వదిలేస్తున్నాడు. అతనిపై చర్య తీసుకుని నాకు న్యాయం చేయాలని పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement