పెళ్లి విందులో చిందులు.. నేలకొరిగిన ‘మహాత్ముడు’ 

Medak Mahatma Gandhi Idol Vandalised Due To Marrige Party - Sakshi

పాపన్నపేట(మెదక్‌): పాపన్నపేట మండలం గాజులగూడెం గ్రామంలో పెళ్లి విందులో చిందులు వేస్తున్న కొంతమంది యువకులు ఆదివారం రాత్రి మహాత్మా గాంధీ విగ్రహానికి తగలడంతో అది కింద పడిపోయింది. అయినా సంఘటనకు కారకులైన వారిలో పశ్చాత్తాపం కనిపించలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. కాగా మాజీ సర్పంచ్‌ బాలాగౌడ్‌ మాట్లాడుతూ విగ్రహాన్ని పునరుద్దరిస్తామని తెలిపారు. 

పెళ్లి కావడం లేదని.. 
వెల్దుర్తి(తూప్రాన్‌): వివాహం కావడం లేదని ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వెల్దుర్తి పంచాయతీ పరిధి ఎల్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన కానికె రమేశ్‌ కుమారుడు గణేష్‌(24) పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగా ఆదివారం రాత్రి భోజనం ముగించుకొని కుటుంబసభ్యులు నిద్రకు ఉపక్రమించారు. అయితే తెల్లవారు జామున చూసేసరికి గణేష్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో శవమై కనిపించాడు. వివాహం కావడం లేదని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మహేందర్‌ వెల్లడించారు.

చదవండి: బూడిదతో గాంధీ బొమ్మ.. లిమ్కా బుక్‌లో చోటు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top