కేసీఆర్‌ దేవుడు.. ఆయననే ధర్నాలో కూర్చునేలా చేస్తారా..?

Man Commits Suicide For Making CM KCR To Sit In Maha Dharna - Sakshi

మనస్తాపంతో రాజ్‌భవన్‌ ముందు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం 

పంజగుట్ట: ‘కేసీఆర్‌ దేవుడు.. ఆయననే దీక్షలో కూర్చునేలా చేశారు.. కేసీఆర్‌ కన్నెర్ర చేస్తే ఎవ్వరూ ఉండరు’అంటూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నినాదాలు చేస్తూ రాజ్‌భవన్‌ ముందు ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా చూడాలని మంత్రులు, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతి నిధులు గవర్నర్‌ తమిళిసైను కలసి వినతిపత్రం ఇచ్చేందుకు రాజ్‌భవన్‌లోకి వెళ్లగా బయట ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

సూర్యాపేట జిల్లా మోతే మండలం లాల్‌తండాకు చెందిన బానోతు నాగరాజు(38) వ్యవసాయ కూలీ. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని అభిమానించేవాడు. అప్పులబాధతో ఇబ్బంది పడుతున్నాడు. గురువారం రాజ్‌భవన్‌ వద్దకు కేసీఆర్‌ గవర్నర్‌ను కలిసేందుకు వస్తున్నారని పలు పత్రికల్లో చూసి సూర్యాపేట నుంచి రాజ్‌భవన్‌కు వచ్చాడు. వచ్చే సమయంలో తన వెంట ఓ బాటిల్‌లో పెట్రోల్‌ తీసుకొచ్చుకున్నాడు. అయితే రాజ్‌భవన్‌కు సీఎం రాకపోవడం, మంత్రులు మాత్రమే లోపలికి వెళ్లడం గమనించిన నాగరాజు.. మధ్యా హ్నం 2:55 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్‌ ముందు ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. పోలీసులు అడ్డుకుని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top