సాక్షి,హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుండి 9వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనుంది. ఈ వారోత్సవాల సమయంలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రైజింగ్ తెలంగాణ- 2047 లక్ష్యాలను క్యాబినెట్ చర్చిస్తోంది.
ఈ నెల 24న హైకోర్టులో స్థానిక ఎన్నికల నిర్వహణపై పిటిషన్ విచారణకు రానుంది. దీనికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోనుంది. తాజాగా పరిణామాలతో డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని సమాచారం.


