తెలంగాణ: భారీగా తగ్గుతున్న కరోనా కేసులు | In Last 24 Hours 582 Corona Positive Cases Reported In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ: భారీగా తగ్గుతున్న కరోనా కేసులు

Oct 26 2020 10:23 AM | Updated on Oct 26 2020 12:04 PM

In Last 24 Hours 582 Corona Positive Cases Reported In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 14,729 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 582 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,31,834కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1,432కి చేరింది.  (నన్ను గెలిపిస్తే అందరికీ ఫ్రీగా వాక్సిన్‌)

నిన్న ఒక్క రోజే 1,432 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 2,11,912కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,611 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 15,581 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 40,94,417కి చేరింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement