Ola Village: కరోనాను జయించిన ‘ఓలా’

Kuntala: Ola Village Recovered With Corona Virus - Sakshi

గ్రామంలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ప్రతీరోజు హైపోక్లోరైడ్‌  పిచికారీ 

కుంటాల: కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో వైరస్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి కట్టుగా ఒకటయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో దాదాపు 3960 వరకు జనాభా ఉంటుంది. గతంలో 15 నుంచి 30వరకు యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామంలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించారు. ప్రతీ రోజు సర్పంచ్, ఆశ, పారిశుధ్య కార్మికులు వాడవాడా తిరుగుతూ.. ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో హైపోక్లోరైడ్‌ పిచికారీ చేయించారు. దీంతో కరోనాను అరికట్టారు. ప్రస్తుతం ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేదు.

చేపట్టిన చర్యలు.. 

  • గ్రామంలో ప్రతీరోజు డ్రెయినేజీలను శుభ్రం చేయించారు. 
  • పారిశుధ్య పనులు ముమ్మరం చేస్తున్నారు. 
  • కరోనాను జయించిన వారి ఇంట్లో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. 
  • ఇతర గ్రామాల వారు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. 
  • ఇంటింటా సర్వే నిర్వహించి జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిని గుర్తించి మందులు పంపిణీ చేశారు. 

అవగాహన కల్పించాం
గ్రామంలో కరోనా కే సులు పెరుగుతుండడంతో తీవ్రంగా భ యాందోళన చెందాం. గ్రామస్తులకు ప్రతీరో జు వైరస్‌ మహమ్మారిపై అవగాహన కల్పించాం. ప్రతిరోజు హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించాం. ప్రసుత్తం ఒక్క కేసు కూడా లేకపోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం.
- కనీస్‌ ఫాతిమా, సర్పంచ్, ఓలా

కరోనాను జయించాను 
కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్న దీంతో పాజిటివ్‌ వచ్చింది. వైద్య సిబ్బంది సూచనాల మేరకు మందులు వాడిన. గ్రామస్తులు ధైర్యం చెప్పారు. అంతేకాకుండా వైద్యసిబ్బంది ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మందులు అందించారు. దీంతో కరోనాను జయించా. 
- జగదీష్, ఓలా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top