TS Minister KTR Extends Support Visakha Steel Plant Protest - Sakshi
Sakshi News home page

‘రేపు తెలంగాణకు కష్టం వస్తే మా వెంట ఎవరుంటారు’‌

Mar 12 2021 3:30 PM | Updated on Mar 12 2021 7:16 PM

KTR Supports Visakha Steel Plant Protest - Sakshi

మేం మొదట భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం

సాక్షి, హైదరాబాద్‌: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై మంత్రి కేటీఆర్‌ మరోసారి స్పందించారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతిస్తే ఆంధ్రప్రదేశ్‌ విషయాలు నీకెందుకని అంటున్నారు.. ఏపీ దేశంలో రాష్ట్రం కాదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారు. ఇవాళ విశాఖ ఉక్కుపై పడ్డారు.. రేపు సింగరేణిని కూడా ప్రైవేట్‌పరం చేస్తామంటారు. ఏపీ విషయంలో నోరు మూసుకుని కూర్చోం. రేపు తెలంగాణకు కష్టం వస్తే మా వెంట ఎవరుంటారు. మేం మొదట భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఆలోచించాలి’’ అన్నారు కేటీఆర్‌.

చదవండి:
గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు ఆ అర్హత లేదా?

Advertisement
 
Advertisement
Advertisement