పంచతత్వ పార్క్ ప్రారంభించిన కేటీఆర్

సాక్షి, హైదరాబాద్ : నగర ప్రజలకు పంచతత్వ పార్క్ అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్‌లో నిర్మించిన ఆక్యుప్రెజర్ వాకింగ్ ట్రాక్‌ను మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఎనిమిది అంశాలతో ఎకరం విస్తీర్ణంలో ఈ ట్రాక్‌ను నిర్మించారు. కంకర రాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో నిర్మించిన ఈ ట్రాక్ మీద నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా ట్రాక్ సర్కిల్‌లో వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ బొంతు రామ్మెహన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి