చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: కొండా రాఘవరెడ్డి | Konda Raghavareddy Comments On Sharmila | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: కొండా రాఘవరెడ్డి

Mar 18 2026 5:47 PM | Updated on Mar 18 2026 6:38 PM

Konda Raghavareddy Comments On Sharmila

సాక్షి, హైదరాబాద్‌: షర్మిలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అన్యాయం ఏంటి? అంటూ కొండా రాఘవరెడ్డి నిలదీశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ వ్యాపారాల్లో ఎక్కడైనా షర్మిల కేవైసీ ఉందా?. వైఎస్సార్‌ ఉ‍న్నప్పుడే ఆస్తుల పంపకం పూర్తి అయ్యింది. వైఎస్‌ జగన్‌ తన కుటుంబ ఆస్తుల నుంచి షర్మిలకు వాటా ఇచ్చారు. రూ.230 కోట్లు ఇచ్చిన అన్న జగన్‌పై షర్మిలకు కృతజ్ఞత లేదు. ఇప్పటికీ వైఎస్‌ జగన్‌పై కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు’’ అంటూ కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు.

‘‘వైఎస్‌ జగన్‌కు, షర్మిలకు ఎవరి ఆస్తులు వారికే ఉన్నాయి. వైఎస్‌ జగన్‌ ఏనాడూ షర్మిల ఆస్తిలో వాటా అడగలేదు.. మరి షర్మిల  ఎందుకు అడుగుతున్నారు?. శత్రువులు ఇంట్లోనే ఉంటారన్నట్టు షర్మిల, సునీత రూపంలో ఉన్నారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు? చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారింది.’’ అని కొండా రాఘవరెడ్డి దుయ్యబట్టారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement