సీఎం సతీమణికి ఢిల్లీలో నేడు వైద్య పరీక్షలు  | KCR Wife To Undergo Medical Examination In Delhi Today | Sakshi
Sakshi News home page

సీఎం సతీమణికి ఢిల్లీలో నేడు వైద్య పరీక్షలు 

Nov 21 2021 4:56 AM | Updated on Nov 21 2021 4:56 AM

KCR Wife To Undergo Medical Examination In Delhi Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. కుమారుడు కేటీ ఆర్‌తో పాటు ఆమె ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. ధాన్యం సేకరణ, నీటి వాటాలపై కేం ద్రంతో చర్చించేందుకు సీఎం కూడా ఆదివారం ఢిల్లీ వెళ్లనున్న సంగతి తెలిసిందే. కోవిడ్‌–19 మహమ్మారి బారినపడిన తర్వాత శోభ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. కేసీఆర్‌ సైతం తన సతీమణితో కలిసి ఆస్పత్రికి వెళ్లనున్నట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement