స్పా సెంటర్‌లో భార్యను చంపిన భర్త..! | Kavadiguda Wife And Husband Incident | Sakshi
Sakshi News home page

స్పా సెంటర్‌లో భార్యను చంపిన భర్త..!

May 20 2026 7:20 AM | Updated on May 20 2026 11:32 AM

Kavadiguda Wife And Husband Incident

హైదరాబాద్‌: కుటుంబ కలహాలతో పాటు అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ ఘటన మంగళవారం గాం«దీనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ బోస్‌ కిరణ్, ఎస్‌ఐ నర్సింహ, బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం. ఆటో డ్రైవర్‌ రాజు, బంగి దేబోరా (25) 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బహదూర్‌పురా కిషన్‌బాగ్‌ ఎంఎన్‌ గూడెంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కవాడిగూడ ప్రధాన రహదారిలోని ఓ సూపర్‌ మార్కెట్‌ 4వ అంతస్తులోని స్పా సెంటర్‌లో దేబోరా బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. 

కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. పెద్ద మనుషులు సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరు ఎంఎన్‌ గూడెంలో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త వేధింపులు ఎక్కువయ్యాయంటూ రాజుపై దేబోరా అత్తాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం కేసు పెట్టింది. అప్పటి నుంచి రాజు కక్ష పెంచుకుని ఆమెను అంతమొందించేందుకు సమయం కోసం వేచి చూస్తున్నాడు. 

మంగళవారం ఉదయం దేబోరా విధుల్లో భాగంగా ఆటోలో కవాడిగూడలోని స్పా సెంటర్‌కు చేరుకుంది. ఆమెను వెంబడించిన రాజు కవాడిగూడకు చేరుకున్నాడు. ఆమె లిఫ్టులోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చాడు. వీరిద్దరూ లిప్టులోనే గొడవ పడుతూ 4వ అంతస్తుకు చేరుకున్నారు. ఆగ్రహానికి గురైన నిందితుడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె శరీరంపై అనేక చోట్ల పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో దేబోరా మృతి చెందింది. నిందితుడు రాజు అత్తాపూర్‌ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. రాజును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement