చాలామంది టచ్‌లో ఉన్నారు: ఇందిరాశోభన్‌

Indira Shoban Says Some Leaders Touch With Her In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘వైఎస్‌ షర్మిల పెట్టబోయే పార్టీలోకి చాలా మంది వస్తారు.. రాబోతున్నారు’ అని షర్మిల అధికార ప్రతినిధి ఇందిరాశోభన్‌ తెలిపారు. ఇప్పటికే చాలామంది షర్మిలతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్‌ నాయకత్వంలో పలువురు ప్రజాప్రతినిధులు లోటస్‌పాండ్‌కు వచ్చారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న సంక్షేమ పాలన తెచ్చేందుకు ముందుకొచ్చిన షర్మిలకు అన్ని విధాలుగా అండదండగా నిలుస్తామని స్పష్టంచేశారు.

ఈ నేపథ్యంలో ఖమ్మంలో నిర్వహించనున్న సంకల్ప సభను జయప్రదం చేసేందుకు తమవంతు సహకారాన్ని అందిస్తామని కోయిలకొండ మాజీ ఎంపీపీ అర్జుమన్‌ ఫాతిమా తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో పిట్టా రామ్‌రెడ్డితో కలిసి ఇందిరాశోభన్‌ మాట్లాడుతూ అన్ని పార్టీలు, వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు షర్మిల వెంట నడిచేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
చదవండి: చంద్రబాబు చరిత్ర హీనుడు: ఎంపీ తలారి రంగయ్య

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top