ముక్కు మూసుకుని.. చెప్పులు చేతపట్టుకుని | Indira Nagar Colony in Hyderabad’s IT Corridor Submerged by Sewage Overflow | Sakshi
Sakshi News home page

ముక్కు మూసుకుని.. చెప్పులు చేతపట్టుకుని

Jun 24 2026 7:31 AM | Updated on Jun 24 2026 11:37 AM

Indira Nagar Colony in Hyderabad’s IT Corridor Submerged by Sewage Overflow

ఐటీ కారిడార్‌లోని ఇందిరానగర్‌ కాలనీని మురుగు ముంచెత్తుతోంది. 16 రోజులుగా ఇక్కడ డ్రైనేజీ నీరు ఇళ్ల మధ్య ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. కాలనీలో నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు మురుగులో నడుస్తూ ముక్కు మూసుకుని, మాస్క్‌లు వేసుకుని, చెప్పులు చేతపట్టుకుని ఆఫీసులకు వెళ్తున్నారు.

 గచ్చిబౌలి నుంచి ట్రిపుల్‌ ఐటీ వైపు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఇందిరానగర్‌లో ఈ నెల 9న భారీ వర్షానికి డ్రైనేజీ నీటిలో కలిసి వరద ప్రవహిస్తోంది. అంజయ్యనగర్, ఏపీహెచ్‌బీ కాలనీ, జయభేరీ ఎన్‌క్లేవ్, జేవీ కాలనీల నుంచి నాలాలన్నింటినీ ఇటు వైపు మళ్లించారు. పైపులైన్‌ చిన్నదిగా ఉండటం, చెత్త పేరుకోవడంతో మురుగు రోడ్డుపైకి వచి్చందని స్థానికులు వాపోతున్నారు. మరో పైపులైన్‌ వేసేందుకు గత ఆగస్టులో శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు పనులు ప్రారంభించనే లేదు.     – గచ్చిబౌలి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement