డాక్టర్‌ ప్రసాదరావుకు ఐఏసీటీఎస్‌ పురస్కారం 

IACTS Award For NIMS Former Director Dr Dasari Prasada Rao - Sakshi

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): ప్రముఖ గుండె శస్త్ర చికిత్స నిపుణుడు, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ పద్మశ్రీ డాక్టర్‌ దాసరి ప్రసాదరావుకు ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కార్డియో వాస్కులర్‌ టోరాసిక్‌ సర్జన్స్‌ (ఐఏసీటీఎస్‌) ప్రతిష్టాత్మక జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. కోయంబత్తూర్‌లో జరిగిన సదస్సులో హార్ట్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా 69వ వార్సిక సదస్సులో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

తమిళనాడు ఆరోగ్య శాఖమంత్రి ఎంఏ సుబ్రమణియన్‌ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ జైల్‌సింగ్‌ మెహర్వాల్‌ కూడా పాల్గొన్నారు. కరోనరీ బైపాస్‌ సర్జరీ, హార్ట్‌ వాల్వ్‌ సర్జరీ, ఇతర గుండె ఆపరేషన్లలో ప్రసాదరావు నిష్ణాతుడైన వైద్యుడిగా, పలువురికి ప్రాణదానం చేసి అందరి మన్ననలు అందుకున్నారు. నిమ్స్‌లో అనేక అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమ్స్‌ యూనివర్సిటీ కోసం కూడా స్థల సేకరణలో కీలకపాత్ర పోషించారు. మెడిసిటీ, కేర్‌ ఆస్పత్రుల వ్యవస్థాపక డైరెక్టర్‌గా కూడా విశేష సేవలు అందించారు. 2001లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top