2030 నాటికి మూడో ఆర్థిక శక్తిగా భారత్‌ | Sakshi
Sakshi News home page

2030 నాటికి మూడో ఆర్థిక శక్తిగా భారత్‌

Published Wed, Jan 25 2023 1:25 AM

Hyderabad: Minister Arjun Ram Meghwal At ICAI Graduation Ceremony - Sakshi

మాదాపూర్‌: ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ 2030 నాటికి మూడో ఆర్థిక శక్తిగా ఎదగనుందని కేంద్ర పార్లమెంట్‌ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ అన్నారు. మాదాపూర్‌ లోని శిల్పకళా వేదికలో మంగళవారం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) 2023 స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ 2047 నాటికి మనదేశం నెంబర్‌వన్‌గా నిలుస్తుందన్నారు.

సీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఆయన పట్టాలను అందజేశారు. ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై చర్చలు నిర్వహించే జీ–20 దేశ సమావేశాల్లో ఐసీఏఐ కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఐసీఏఐ అధ్యక్షుడు దేబాషిన్‌ మిత్రా మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన సీఏ ఉత్తీర్ణులైన విద్యా ర్థుల్లో 42% మహిళలే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఐ ఉపాధ్యక్షుడు అనికేత్‌ సునీల్‌ తలాటి, ఐసీఏఐ కౌన్సిల్‌ సభ్యులు శ్రీధర్‌ ముప్పాల, ప్రతినిధులు సుశీల్‌కుమార్‌ గోయల్, ప్రసన్నకు మార్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement