Secunderabad Agnipath Protests: Hyderabad Metro Train And MMTS Stopped, Details Inside - Sakshi
Sakshi News home page

Agnipath Scheme Protests: అగ్నిపథ్‌ ఆందోళన ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌ మెట్రో రైళ్లు రద్దు

Published Fri, Jun 17 2022 1:42 PM

Hyderabad Metro Rail Stopped Due To Secunderabad Railway Station Protest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో హైదరాబాద్‌ మెట్రో రైళ్లను అధికారులు నిలిపివేశారు. మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు రావొద్దని అధికారులు సూచించారు. నగరంలోని అన్ని మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి యధావిధిగా సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో సబ్‌ అర్బన్‌ సర్వీస్‌లను రద్దుచేశారు. మరోవైపు ఢిల్లీలోనూ మెట్రో రైళ్లను అధికారులు నిలిపివేశారు.
చదవండి: Live Updates: అగ్నిగుండంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌

ఇక సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆర్పీఎఫ్‌ కాల్పుల్లో గాయపడిన యువకుడు మృతి చెందాడు. గత నాలుగు గంటలుగా పోలీసులు కాల్పులు జరిపినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇంకా రైల్వేట్రాక్‌పైనే వేలాదిమంది నిరసనకారులు బైఠాయించారు. రైల్వే పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నారు. రైల్వే స్టేషన్‌ వదిలి వెళ్లిపోవాలని, ఆందోళనలు విరమించకపోతే మళ్లీ కాల్పులు జరుపుతామని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత వార్త: న్యాయం కావాలని అడిగితే చంపేస్తారా: ఆందోళనకారులు

Advertisement
Advertisement