రాజీవ్‌ స్వగృహ టోకెన్‌ అడ్వాన్స్‌ చెల్లింపు గడువు పెంపు   | Hyderabad: Date Extended for Rajiv Swagruha Token Advance | Sakshi
Sakshi News home page

Rajiv Swagruha: రాజీవ్‌ స్వగృహ టోకెన్‌ అడ్వాన్స్‌ చెల్లింపు గడువు పెంపు  

Jan 19 2023 2:56 PM | Updated on Jan 19 2023 2:56 PM

Hyderabad: Date Extended for Rajiv Swagruha Token Advance - Sakshi

రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన ఫ్లాట్స్‌ను సొంతం చేసుకునేందుకు వినియోగదారులు టోకెన్‌ అడ్వాన్స్‌ చెల్లించే గడువును హెచ్‌ఎండీఏ పొడిగించింది.

సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన ఫ్లాట్స్‌ను సొంతం చేసుకునేందుకు వినియోగదారులు టోకెన్‌ అడ్వాన్స్‌ చెల్లించే గడువును హెచ్‌ఎండీఏ పొడిగించింది. ఫిబ్రవరి 15 వరకు అడ్వాన్స్‌ డిమాండ్‌ డ్రాఫ్ట్‌లను మేనేజింగ్‌ డైరెక్టర్, తెలంగాణ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్, ఉర్దూగల్లీ, స్ట్రీట్‌నెం.17, హిమాయత్‌నగర్‌ హైదరాబాద్‌కు చేరేలా పంపించాలని సూచించింది. 

అనంతరం ఫ్లాట్స్‌ కేటాయింపునకు సంబంధించి లాటరీని పారదర్శక విధానంలో నిర్వహిస్తామని తెలిపింది. ప్రస్తుతం పోచారంలో 3 బీహెచ్‌కె ఫ్లాట్స్‌ 16, 2బీహెచ్‌కే ఫ్లాట్స్‌ 570, 1 బీహెచ్‌కె ఫ్లాట్స్‌ 269 ఉన్నాయని తెలిపింది. 

ఇక బండ్లగూడలో 1బీహెచ్‌కే ఫ్లాట్స్‌ 344, సీనియర్‌ సిటీజన్లకు 1 బీహెచ్‌కే ఫ్లాట్స్‌ 43 ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌కు రూ.3 లక్షలు, 2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌కు రూ.2 లక్షలు, 1 బీహెచ్‌కే ఫ్లాట్‌కు రూ.లక్ష చొప్పున టోకెన్‌ అడ్వాన్స్‌గా చెల్లించాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement