హనీ ట్రాప్‌కు చిక్కి.. 38.73 లక్షలు పోగొట్టుకున్న రిటైర్‌ ప్రభుత్వ ఉద్యోగి | Retired Government Employee Loses Rs 38.73 Lakhs After Honeytrapped By Cyber Criminals | Sakshi
Sakshi News home page

హనీ ట్రాప్‌కు చిక్కి.. 38.73 లక్షలు పోగొట్టుకున్న రిటైర్‌ ప్రభుత్వ ఉద్యోగి

Jun 18 2025 4:22 PM | Updated on Jun 18 2025 5:16 PM

Hyderabad: Cybercriminals Honeytrapped A Retired Government Employee

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని హనీ ట్రాప్ చేసి 38.73 లక్షలను సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. ఫేస్‌ బుక్‌లో వృద్దుడికి మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. తండ్రి తమను వదిలేసి వెళ్లిపోయాడని.. తల్లి టైలర్ అంటూ సదరు ఆ మహిళ పరిచయం చేసుకుంది. చాటింగ్ చేసేందుకు ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆ మహిళ.. కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన కేబుల్ ఆపరేటర్ నంబర్‌తో మాట్లాడిన బాధితుడు రూ.10 వేలు పంపించాడు.

అనంతరం మహిళ నుంచి ఫేస్‌ బుక్‌లో స్పందన లేకపోవడంతో కేబుల్ ఆపరేటర్‌తో బాధితుడు చాటింగ్ చేశాడు. సదరు మహిళ జబ్బు పడిందని.. ఆస్పత్రిలో ఉందని  చెప్పడంతో రూ. 10 లక్షలు ఆ వృద్ధుడు పంపించాడు. అనంతరం క్రెడిట్ కార్డు నుంచి మరో 2.65 లక్షలు చెల్లించాడు.

కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ దుబాయ్ వెళ్లిపోయిందని.. ఆమె కాంటాక్ట్స్ ఏమీ లేవని చెప్పిన కేబుల్ ఆపరేటర్.. తన తల్లి, సోదరి మీతో మాట్లాడాలనుకుంటున్నారంటూ కేబుల్ ఆపరేటర్ చెప్పగా.. సరేనన్న వృద్ధుడు.. కొద్ది రోజుల పాటు తల్లి, సోదరితో లైంగికంగా చాటింగ్ చేశాడు. తన తల్లి, మైనర్ చెల్లితో చాటింగ్ చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ కేబుల్‌ ఆపరేటర్‌ బెదిరించాడు. పోలీస్ కానిస్టేబుల్ పేరుతో మ్యాటర్ సెటిల్ చేసుకోవాలంటూ బాధితుడికి సందేశం పంపాడు.

బాలిక చదువు, తల్లి డ్వాక్రా రుణం చెల్లింపు నిమిత్తం 12.5 లక్షలు చెల్లించిన బాధితుడు.. సెటిల్ చేసిన కానిస్టేబుల్, ఎస్‌ఐకి లక్ష సమర్పించుకున్నాడు. కొత్త ఎస్‌ఐ వచ్చానని.. కేసు అవ్వకుండా ఉండాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలంటూ మరో వ్యక్తి డిమాండ్‌ చేశాడు. దీంతో మరో ఏడు లక్షలను ఆ వృద్ధుడు పంపించాడు. ఇలా మొత్తం 38.73 లక్షలు ఆ ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగి దగ్గరి నుంచి సైబర్ నేరగాళ్లు  దోపిడీ చేసేశారు.

Advertisement
 
Advertisement
Advertisement