థర్డ్‌వేవ్‌పై ఆందోళన.. డాక్టర్లేమంటున్నారంటే..

HYD: Gandhi Hospital Superintendent On Third Wave - Sakshi

50వేల మంది కోవిడ్‌ బాధితులకు సేవలు

500 మంది బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు సర్జరీలు 

‘సాక్షి’తో గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు  

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆగస్టు మొదటి వారంలో థర్డ్‌వేవ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే వైరస్‌ తీవ్రతపై ఇప్పటికీ స్పష్టత లేదు. సెకండ్‌ వేవ్‌లో కనిపించినంత తీవ్రత కన్పించకపోవచ్చు. దీనిపై ఆందోళన అవసరం లేదు. డెల్టా ఫ్లస్‌ వంటి కొత్త వేరియంట్‌లు వస్తే కేసులు పెరిగే అవకాశం ఉంది’ అని గాంధీ ఆస్పత్రి సపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు అన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. ఇప్పటి వరకు 500 మంది బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందించామని, వీరిలో వంద మందికి దవడ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీలు, 300 మంది ముక్కు, వంద మందికి పైగా కంటి సంబంధిత చికిత్సలు చేసినట్లు తెలిపారు.    

50 వేల మందికి చికిత్స.. 
ఫస్ట్‌వేవ్‌లో 35 వేల మందికి చికిత్స చేశామని. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు 15 వేల మందికి చికిత్స అందించినట్లు తెలిపారు. సెకండ్‌వేవ్‌లో సీరియస్‌ కేసులే ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బాధితుల్లో 1500 మంది చిన్నారులు ఉన్నారని. మరో 1500 మంది గర్భిణులకు ఆస్పత్రిలో పురుడు పోశామన్నారు.

ఆశీర్వాదాలే ఇమ్యూనిటీ బూస్టర్లు..
ఫస్ట్‌వేవ్‌లో చికిత్సపై ఓ స్పష్టత లేదని, రోజంతా పీపీఈ కిట్లు ధరించి, రోగుల మధ్య గడపాల్సి వచ్చిందన్నారు. దాదాపు 15 నెలలుగా రోగుల మధ్యే జీవిస్తున్నామని, ఇప్పటి వరకు ఆస్పత్రిలో 280 మందికి పైగా వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రిలో కోలుకున్న వారి ఆశీ ర్వదాలే తమకు ఇమ్యూనిటీ బూస్టర్లుగా పని చేస్తున్నాయి.  

కేసులు మరింత తగ్గితేనే..
ఆస్పత్రిలో 700 మంది వరకు చికిత్స పొందుతున్నారని, కోవిడ్‌ సహా బ్లాక్‌ఫంగస్‌ కేసుల సంఖ్య తగ్గితే సాధారణ సేవలు పునరుద్ధరిస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top