'నేను చనిపోతున్నా.. పిల్లల్ని బాగా చూసుకో'

Husband Decesed Life After Video Calling To Wife In Kodad - Sakshi

సాక్షి,కోదాడ‌: భార్యకు వీడియో కాల్‌ చేసి ఓ వ్యక్తి  ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలోని సాయిబాబా థియేటర్‌ బజార్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన రుంజా అశోక్‌(32) టాటాఏస్‌ వాహనం డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. లాక్‌డౌన్‌ కారణంగా పనిదొరక్క పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్యది కాపుగల్లు కావడంతో ఏదైనా పని చేసుకుందామని నెలరోజుల కిందట కోదాడ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో  ఉంటున్నారు.

పని లేకపోవడం.. తాగుడుకు అలవాటుపడిన అశోక్‌ భార్య పిల్లలను పుట్టింటికి పంపించాడు. శుక్రవారం రాత్రి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని పిల్లలను మంచిగా చూసుకో అని భార్యకు వీడియో కాల్‌ చేసి చెప్పాడు. వెంటనే వారు కోదాడకు వచ్చి చూసేవరకు అప్పటికే  అశోక్‌ మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ సంఘటనపై మృతుడి  తండ్రి దావిద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ సైదా తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top