హైదరాబాద్‌లో భారీ వర్షం | Heavy rain in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ వర్షం

Mar 27 2026 10:14 PM | Updated on Mar 28 2026 1:22 AM

Heavy rain in Hyderabad

సాక్షి హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది.  నిజాంపేట్‌, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాచారం, చిల్కానగర్‌లో  ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు  పడ్డాయి.  ఎండాకాలం కావడంతో మధ్యాహ‍్నం వేళ సూర్యుని వేడిమికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు రాత్రివేళ ఈ జల్లులు కొద్దిమేర ఉపశమనం కలిగించాయి. అయితే రాత్రి పదిగంటల ప్రాంతంలో వర్షం కురవడంతో ‍ట్రాఫిక్‌కు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు.  

Advertisement
 
Advertisement
Advertisement