తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక.. 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ | Heavy Rain Fall In Telangana Live Updates Latest News Telugu, SCR Cancels Several Trains Due To Heavy Rains | Sakshi
Sakshi News home page

Telangana Rains Updates: తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక.. 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Aug 28 2025 7:16 AM | Updated on Aug 28 2025 9:25 AM

Heavy Rain Fall In Telangana Live Updates

Heavy Rain Updates..

మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..

  • భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
  • నేడు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచాం..
  • నిరాశ్రయులైన ప్రజల కోసం ఆహారం, ఇతర వస్తువులు అందుబాటులో ఉంచాం..
  • ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని సీఎం సమీక్షిస్తారు.
  • కామారెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష చేస్తా.
  • సాయంత్రం వరకు పంట, ప్రాణ, ఆస్తి నష్టంపై నివేదిక వస్తుంది.

 

భారీ వర్షాలపై కేసీఆర్‌ ఆందోళన..

  • భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందుల పట్ల మాజీ సీఎం కేసీఆర్ ఆందోళన
  • వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో మాట్లాడిన కేసీఆర్‌
  • తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆదేశం

తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్.. 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్

  • తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • భద్రాద్రి, భూపాలపల్లి, ఆదిలాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, కొమురంభీం,
  • నిజామాబాద్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు.
  • ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు, ఉరుములు, మెరుపులు వర్షాలు..
  • తెలంగాణలో మొత్తం 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
  • 11 జిల్లాల్లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే అవకాశం 

 

వర్షాల ఎఫెక్ట్‌.. 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు

  • తాజాగా నల్లగొండ, యాదాద్రి, కరీంనగర్‌, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో విద్యాసంస్థలు బంద్‌
  • ఇప్పటికే కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ఇచ్చిన అధికారులు.
  • కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలకు సెలవు
  • కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలకు ఇవాళ సెలవు
  • భారీ వర్షాల దృష్ట్యా సెలవు ప్రకటించిన జిల్లా విద్యాధికారులు

 NH-44పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. 

  • ఆదిలాబాద్ జిల్లా : భారీ వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు
  • అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచన
  • రాత్రి నుంచి ఏకధాటి వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాలు
  • ఆదిలాబాద్ జిల్లా: వర్ష బీభత్సానికి విరిగిపడిన చెట్లు, తెగిన విద్యుత్ తీగలు
  • భీంపూర్, తాంసి మండల్లోని 50 గ్రామాలకు రాత్రి నుంచి నిలిచిన విద్యుత్ సరఫరా
  • ఎన్‌హెచ్‌-44పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 
  • లారీలు, వాహనాలు కిలోమీటర్ల మేర్ల బారులు తీరాయి. 

 


పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • ఉదయం 8 గంటలకు 34.9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

 


మానేరు ఉగ్రరూపం.. 

 

  • మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మానేరు ఉగ్రరూపం
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
  • తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజల అవస్థలు
  • మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మానేరు ఉగ్రరూపం
  • పాల్వంచ వాగు, కూడవెల్లి వాగుల నుంచి మానేరులోకి భారీగా వరద
  • రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మానేరువాగు
  • నిండుకుండను తలపిస్తున్న నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు జలాశయం
  • ఎగువ మానేరు జలాశయం నుంచి దిగువకు వరద విడుదల
  • మానేరు ఉగ్రరూపంతో మిడ్ మానేరులోకి భారీగా వరద నీరు
  • వచ్చే 2 గంటల్లో కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం,
  • మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, పెద్దపల్లిలో భారీ వర్షాలు
  • వచ్చే 2 గంటల్లో సిద్దిపేట, మెదక్, జనగాం, యాదాద్రి, మంచిర్యాలలో మోస్తరు వర్షాలు

వరంగల్‌ అతలాకుతలం.. 

  • ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
  • ములుగు జిల్లా తాడ్వాయిలో 15 సెం.మీ వర్షపాతం
  • వెంకటాపూర్‌లో 12 సెం.మీ., గోవిందరావుపేటలో 11 సెం.మీ. వర్షపాతం
  • ములుగు జిల్లా: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు
  • మేడారం వద్ద బ్రిడ్జి ఆనుకుని పారుతున్న జంపన్నవాగు
  • పసర నుంచి తాడ్వాయి మధ్యలో ఉన్న జలగలంచ వాగు ఉద్ధృతి
  • పసర నుంచి తాడ్వాయి మధ్య వాహనాల రాకపోకల నిషేధం
  • జలగలంచ వాగు ఉద్ధృతితో ప్రజలను పునరావాస కేంద్రానికి తరలింపు
  • హనుమకొండ జిల్లాలో అలుగుపారుతోన్న కటాక్షపూర్ చెరువు
  •  

 

వర్షాల ఎఫెక్ట్‌.. రైళ్లు రద్దు..

  • భారీ వర్షాల వల్ల పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
  • రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
  • భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల మళ్లింపు, రద్దు, పాక్షిక రద్దు
  • భారీ వర్షం కారణంగా పట్టాలపై నుంచి ప్రవహిస్తున్న వరద
  • వరద దృష్ట్యా రైళ్ల దారి మళ్లింపు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం
  • ఇవాళ నడవాల్సిన అకోల- అకోట, కాచిగూడ- నాగర్‌సోల్‌ రైళ్లు రద్దు
  • ఇవాళ నడవాల్సిన కాచిగూడ - కరీంనగర్, హెచ్.ఎస్ నాందేడ్ - మేడ్చల్ రైళ్లు రద్దు
  • హైదరాబాద్-కామారెడ్డి మధ్య నిలిచిన పలు రైళ్ల రాకపోకలు
  • భిక్కనూరు-తలమడ్ల స్టేషన్ల మధ్య పట్టాలపై చేరిన వర్షపు నీరు
  • అక్కన్నపేట్‌-మెదక్‌ స్టేషన్ల మధ్య పట్టాలపై చేరిన వర్షపు నీరు
  • కరీంనగర్- కాచిగూడ, మెదక్‌- కాచిగూడ, బోధన్‌- కాచిగూడ రైళ్లు రద్దు
  • కాచిగూడ-మెదక్, నిజామాబాద్- తిరుపతి, ఆదిలాబాద్‌- తిరుపతి రైళ్లు రద్దు
  • రేపటి కాచిగూడ - నర్కేర్ సర్వీస్‌ను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
  • గజ్వేల్ - లక్డారం రైలు పట్టాలపై భారీగా ప్రహిస్తున్న వరద నీరు
  • ఇవాళ, రేపు మల్కాజిగిరి- సిద్దిపేట సర్వీసు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
  • ప్రయాణికుల కోసం హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే
  • కాచిగూడ స్టేషన్‌లో 9063318082 నంబర్‌ ఏర్పాటు
  • సికింద్రాబాద్ స్టేషన్‌లో 040- 27786170 నంబర్‌ ఏర్పాటు
  • నిజామాబాద్ స్టేషన్‌లో 970329671 నంబర్‌ ఏర్పాటు
  • కామారెడ్డి స్టేషన్‌లో 9281035664 నంబర్‌ ఏర్పాటు

 వర్షాల రెడ్‌ అలర్ట్‌.. 

  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు
  • ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమైన అధికారులు
  • ఆదిలాబాద్‌: ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షం
  • ఇవాళ ఆదిలాబాద్‌, నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
  • కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
  • కడెం ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీరు విడుదల
     

అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఎకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని పలు గ్రామాలు నీటి మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్‌ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా పడ్డాయి. శుక్రవారం యథాతథంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు.

ఇక, కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసింది. నిర్మల్‌ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెం.మీ, మెదక్‌ జిల్లా సర్దానలో 30.2 సెం.మీ, కామారెడ్డి పట్టణంలో 28.9 సెం.మీ, కామారెడ్డి జిల్లా భిక్‌నూర్‌లో 27.9 సెం.మీ, నిర్మల్‌ జిల్లా వడ్యాల్‌లో 27.9 సెం.మీ, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 27.5 సెం.మీ, మెదక్‌జిల్లా నాగాపూర్‌ గ్రామంలో 26.6 సెం.మీ, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 24.6 సెం.మీ, లింగంపేటలో 22.5 సెం.మీ, దోమకొండలో 20.2 సెం.మీ, నిర్మల్‌ జిల్లా విశ్వనాథ్‌పేట్‌లో 24.1 సెం.మీ, ముజిగిలో 23.1 సెం.మీ, మెదక్‌ జిల్లా చేగుంటలో 20.2 సెం.మీల వర్షం పాతం నమోదైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement