బాలిక కడుపులో 2 కిలోల వెంట్రుకల ఉండ!

Hairball Removed From Teenage Girl Stomach At Gaganpahad - Sakshi

కడుపులో ఉండలా పేరుకుపోయిన వెంట్రుకలు 

కడుపు నొప్పి రావడంతో సర్జరీ చేసి తొలగించిన ఉస్మానియా వైద్యులు 

సాక్షి, హైదరాబాద్‌: ఆమె 17 ఏళ్ల  అమ్మాయి. గత 5 నెలలుగా ఆహారంతో పాటు ఆమె ఏం తింటోందో తెలుసా? తన వెంట్రుకలు..! అదేంటి ఎవరైనా వెంట్రుకలు తింటారా అని ఆశ్చర్యపోతున్నారా? అవును ఈ విషయం తెలిసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. అయితే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆ అమ్మాయి అప్పుడప్పుడూ తన వెంట్రుకలు తానే లాక్కుని తినేదని డాక్టర్లు గుర్తించారు. గగన్‌పహాడ్‌కు చెందిన ఎం.పూజితకు కడుపు నొప్పి రావడం, వాంతులు చేసుకుంటుండటంతో మే 31న ఆస్పత్రిలో చేర్పించారు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ తీయగా, కడుపులో వెంట్రుకలు ఉండలా పేరుకుపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

జనరల్‌ సర్జరీ విభాగాధిపతి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ పర్యవేక్షణలో డాక్టర్‌ రాణి, డాక్టర్‌ అనిల్‌కుమార్, డాక్టర్‌ పావని, డాక్టర్‌ పాండునాయక్‌ వైద్య బృందం జూన్‌ 2న ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. పెద్దపేగు, చిన్నపేగులో 120 సెంటమీటర్ల పొడవు, 2 కేజీల బరువు ఉన్న వెంట్రుకలతో కూడిన ఉండను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి కేసులు 68 నమోదు కాగా.. రాష్ట్రంలో మొదటిదని చెబుతున్నారు.
చదవండి: సీపీఎస్‌ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం తరహాలో ఫ్యామిలీ పెన్షన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top