పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్‌ | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్‌

Published Fri, Sep 15 2023 7:59 PM

Good News:Telangana Govt Decided Provide Breakfast In Government Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ, విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. 

దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10 వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది. దీనివల్ల విద్యార్థులకు చక్కని బోధనతో పాటు మంచి పోషకాహారం అందిచే దిశగా ప్రభుత్వం పథకాన్ని అమలు చేయనున్నది. 

తద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ఉదయాన్నే వ్యవసాయం పనులు కూలీపనులు చేసుకోవడానికి వెల్లే విద్యార్థుల  తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ ఆ దిశగా ఈ అల్పాహారం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం దసరానుంచి అమలు చేయనుంది. 
చదవండి: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ..

కాగా.. తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకం విధానాన్ని పరిశీలించి రావాలని ఐఎఎస్ అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్ ఇటీవలే పంపించారు.  అక్కడ విజయవంతంగా అమలవుతున్న ‘విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని అధ్యయనం చేసిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చింది.

అయితే విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించే సీఎం కేసీఆర్ ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్టు ను అందచేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను రాష్టర ప్రభుత్వ ఖజానా పై ప్రతి యేటా దాదాపు రూ. 400 కోట్ల అదనపు భారం పడనున్నది.

Advertisement
Advertisement