ఆన్‌లైన్‌ క్లాసు కోసం ఆత్మహత్యాయత్నం | Girl Trying Her Own Life For Smartphone Due To Missing Online Classes | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ క్లాసు కోసం ఆత్మహత్యాయత్నం

Sep 9 2020 11:46 AM | Updated on Sep 9 2020 2:25 PM

Girl Trying Her Own Life For Smartphone Due To Missing Online Classes - Sakshi

సాక్షి, శంకరపట్నం(మానకొండూర్‌): ఆన్‌లైన్‌ క్లాసు వినేందుకు ఓ విద్యార్ధిని సెల్‌ఫోన్‌ లేదని అఘాయిత్యానికి పాల్పడింది. ఈ సంఘటన శంకరపట్నం మండలం ఇప్పలపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. మండలంలోని ఇప్పలపల్లె గ్రామానికి చెందిన 13 ఏళ్ల విద్యార్థిని రాజన్నసిరిసిల్ల జిల్లాలో సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుతోంది. సెప్టెంబర్‌ 1 నుంచి ప్రభుత్వం ఆన్‌లైన్‌ క్లాస్‌లు ప్రారంభించింది. ఈ క్లాసులు వినేందుకు ఇంట్లో కుటుంబసభ్యుల సెల్‌ఫోన్‌ను సదరు విద్యార్థిని వాడుకుంటోంది. సదరు విద్యార్థిని సోదరుడు కేశవపట్నంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్నాడు. ఇద్దరు ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు సెల్‌ఫోన్‌కోసం పట్టుబట్టారు. ఇంట్లో స్మార్ట్‌ఫోన్‌ ఒక్కటే ఉండడంతో తమ్ముడికి ఫోన్‌ ఇచ్చారని, నాకు ఇవ్వలేదని ఆన్‌లైన్‌ క్లాసులు మిస్సవుతున్నానని ఇంట్లో వరిపొలం కోసం దాచిని పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement