చిరు వ్యాపార సముదాయాలకు..  సేఫ్టీ మస్ట్‌ 

GHMC special measures to prevent fire accidents - Sakshi

అగ్ని ప్రమాదాల నివారణకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు 

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని ఫైర్‌ మిటిగేషన్, సేఫ్టీ  సర్టిఫికెట్‌ పొందాలని సూచన

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అగ్ని ప్రమాదాల నివారణకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. చిరు వ్యాపారస్తులు సుమారు 100 చదరపు గజాల విస్తీర్ణం గల భవనాలకు తప్పనిసరిగా ఫైర్‌ మిటిగేషన్, సేఫ్టీ సర్టిఫికెట్‌ తప్పని సరిచేసి సోమవారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించింది.

చిన్న చిన్న షాపులు, వ్యాపారం చేసుకునే ఇంటి యజమానులు గానీ.. అద్దెకు తీసుకొని వ్యాపారం చేసుకునే వారు అగ్ని ప్రమాదాల నివారణకు ఎవరికి వారే స్వయంగా ఫైర్‌ మిటిగేషన్, సేఫ్టీ సర్టిఫికెట్‌ తీసుకునేందుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. 

దరఖాస్తు విధానం ఇలా... 
వెబ్‌సైట్‌ www.ghmc.gov.in ను క్లిక్‌ చేసి ఫైర్‌ మిటిగేషన్‌/సేఫ్టీ సర్టిఫికెట్‌ను సెలెక్ట్‌ చేయాలి లేదా  https://firesafety. ghmc.gov.in లో లాగిన్‌ కావాలి. 
 లింక్‌  ఓపెన్‌ చేసిన తర్వాత తమ మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసిన వెంటనే వచ్చిన  ఓటీపీని తప్పనిసరిగా నమోదు చేయాలి.  
   అగ్ని ఆర్పే పరికరాల ఏజెన్సీ జాబితా నుంచి తమకు నచ్చిన ఎంపానెల్‌ ఏజెన్సీని సెలెక్ట్‌ చేసుకోవాలి. 
 అర్జీదారుడు ఇంటి ట్యాక్స్‌ ఇండెక్స్‌ నంబర్‌ (టిన్‌) కలిగి ఉన్న పక్షంలో టిన్‌ నంబర్‌తో పాటు ఎంపానెల్‌ ఏజెన్సీ ఎంపికను కన్ఫర్మ్‌ చేసుకోవాలి. ఒకవేళ టిన్‌ నంబర్‌లేని పక్షంలో  షాప్‌ ఎస్టాబ్లిష్మెంట్, అడ్రస్, సర్కిల్‌  లేదా జోన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత ఎంపానల్‌  ఏజేన్సీని సెలెక్ట్‌ చేసుకొని కన్ఫర్మ్‌ చేసుకోవాలి.  
 ఎంపానెల్డ్‌ ఏజెన్సీని సెలెక్ట్‌ చేసుకున్న తర్వాత ఏజెన్సీ తమ షాపు వద్దకు వచ్చి అగ్ని ఆర్పే పరికరాన్ని ఫిట్టింగ్‌ చేసిన తర్వాత ఆ ఏజెన్సీ ఫిట్టింగ్‌ చేసినట్టు వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. 
 తదుపరి ఫైర్‌ మిటిగేషన్‌/సేఫ్టీ సర్టిఫికెట్‌ ఆన్‌లైన్‌లో జనరేట్‌ అవుతుంది. ఆ తర్వాత తమ అప్లికేషన్‌ స్టేటస్‌ రిపోర్ట్‌లో చూసుకోవచ్చు. 
♦ జనరేట్‌ అయిన సేఫ్టీ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని షాప్‌లో డిస్‌ ప్లే చేసుకోవాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top