కామారెడ్డి: ఫారెస్ట్‌ ఆఫీసర్లను బంధించిన తండా వాసులు

Forest Officers Captured By Thanda Residents At Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మం‍డలం పాత ఎల్లంపేట పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. అటవీ అధికారుల్ని తండా వాసులు బంధించారు. అటవీ భూమిని చదును చేస్తుండగా అధికారులు అక్కడికి వెళ్లారు.  తండావాసుల్ని అడ్డుకోగా.. వాళ్లు ఉల్టా అధికారుల్ని బంధించారు. 

పోలీసుల కథనం ప్రకారం.. అక్కాపూర్ -మైసమ్మ చెరువు  దుర్గమ్మ గుడి తండా సమీపంలోని అటవీ భూమిని అక్కడి ప్రజలు చదును చేస్తున్నారు. ఆ సమయంలో అటవీ అధికారులు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించిన తండా వాసులు.. అధికారుల్ని బంధించారు. ఈ ఘటనపై స్థానిక మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేష్. దీంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 

ఇదీ చదవండి: నెహ్రూ ఓఆర్‌ఆర్‌ ప్రవేట్‌ చేతుల్లోకి..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top