కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రి అరెస్ట్‌ | Father Arrested Due To Convicted Molestation His Daughter | Sakshi
Sakshi News home page

కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన తండ్రి అరెస్ట్‌

Dec 8 2021 2:26 PM | Updated on Dec 8 2021 2:31 PM

Father Arrested Due To Convicted Molestation His Daughter - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నల్లగొండ క్రైం: మద్యానికి బానిగా మారి కన్నకూతురిని లైంగిక వేధింపులకు గురిచేసిన తండ్రిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు నల్లగొండ రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ మండలం చెన్నుగూడెం గ్రామానికి చెందిన మర్రి నర్సింహ కొంతకాలంగా మద్యానికి బానిసై ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. పైగా సమీప బంధువులు తీసుకువచ్చిన వివాహ సంబంధాలను చెడగొడుతూ మానసికంగా వేధిస్తున్నాడని, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement