ఉచిత నీటి పథకానికి గడువు పెంపు

 Extends Date For Fixing Up Meters For Free Water Scheme In Telangana - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం పొందేందుకు గడువును ఆగస్టు 15 వరకు పొడిగిస్తూ జలమండలి నిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌ పరిపాలన శాఖ ఆదేశంతో ఈ వెసులుబాటు కల్పించింది. వినియోగదారులు తమ నల్లాలకు నూతన మీటర్‌ను ఏర్పాటు చేసుకోవడం, కనెక్షన్‌ నంబరుకు ఆధార్‌ అనుసంధానం చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 వరకు నీటిబిల్లుల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక అపార్ట్‌మెంట్లలోనూ ప్రతి ఫ్లాట్‌ వినియోగదారుడూ నల్లా క్యాన్‌ నంబరుకు ఆధార్‌ నంబరును జత చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అనుసంధానం పూర్తయిన వారికే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఆగస్టు 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేసుకోని పక్షంలో సదరు వినియోగదారులకు డిసెంబరు-2020 నుంచి ఆగస్టు-2021 మధ్యకాలానికి నీటిబిల్లు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఆధార్‌ అనుసంధానానికి సమీప మీ సేవ కేంద్రాల్లో, లేదా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.హైదరాబాద్‌ వాటర్‌జీఓవీ.ఐఎన్‌ సైట్‌ను, ఇతర వివరాలకు కస్టమర్‌ కేర్‌ నంబరు 155313ని సంప్రదించాలని సూచించింది.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top