పదేళ్ల పార్ధివ్‌కు ‘డయానా అవార్డు’  | Diana Award 2022 For Ten Year Old Boy Sripardhiv | Sakshi
Sakshi News home page

పదేళ్ల పార్ధివ్‌కు ‘డయానా అవార్డు’ 

Jul 4 2022 3:23 AM | Updated on Jul 4 2022 4:07 PM

Diana Award 2022 For Ten Year Old Boy Sripardhiv - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదేళ్ల శ్రీపార్ధివ్‌ కనిష్క్‌ గుత్తి ప్రతిష్టాత్మక ‘డయానా అవార్డు’అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన పార్ధివ్‌ ప్రస్తుతం అబుదాబిలో నివసిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 9 నుంచి 25 ఏళ్ల వయసున్న యువత చేసిన సోషల్‌వర్క్‌ని పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.

నిరుపేద, వెనుకబడిన పిల్లలకు విద్యను అందించినందుకు, పర్యావరణ వేత్తగా ఉన్నందుకు శ్రీపార్ధివ్‌ను ఈ అవార్డు వరించింది. పార్ధివ్‌ పర్యావరణ కార్యక్రమాలతో పాటు కేన్సర్‌ రోగుల గురించి అవగాహన పెంచడానికి రెండున్నరేళ్లు జుట్టు పెంచుకుని, తన టీమ్‌వర్క్‌లో భాగంగా 25 విగ్గులను కేన్సర్‌ స్వచ్ఛంద సంస్థకు డొనేట్‌ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement