Coronavirus: డేంజరస్‌ డెల్టా ఒళ్లంతా తిష్ట!

Delta Mutation Coronavirus Is More Dangerous It Will Spoil All Organs In Human Body - Sakshi

ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్‌ సహా అన్నింటిపైనా ప్రభావం

మొదటి దశతో పోలిస్తే రెండో దశలో రెట్టింపు తీవ్రత

డెల్టా వేరియంట్‌ వైరస్‌ నియంత్రణకు వైద్యుల తీవ్ర ప్రయత్నాలు

18 రెట్లు పెరిగిన స్టెరాయిడ్ల వాడకం...

యాంటీబయాటిక్స్‌ రెట్టింపు

మొదటి, రెండో దశ రోగులపై రిషికేశ్‌ ఎయిమ్స్‌ అధ్యయనం

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ సెకండ్‌వేవ్‌లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్‌ శరీరంలోని కీలక భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. బి.1.617.2 కోడ్‌తో ఉన్న వేరియంట్‌ను డెల్టాగా పిలుస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందిన ఈ వేరియంట్‌ మానవ శరీరంలోకి ప్రవేశించాక అవయవాలపై వేగంగా ప్రభావాన్ని చూపడంతో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. కరోనా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో ఎక్కువ మంది ఆస్పత్రిపాలయ్యారు.

అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది మరణం అంచులవరకు వెళ్లి వచ్చారు. కొందరిలో అవయవాలు దెబ్బతినగా, మరికొందరు జీవితకాల వ్యాధులైన బీపీ, షుగర్‌ బారినపడ్డారు. మొదటి దశ, రెండో దశలో ఆస్పత్రిలో చేరి.. వారు ఎదుర్కొన్న సమస్యలు, వైరస్‌ ప్రభావం తదితర అంశాలపై రిషికేష్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) పరిశోధన చేసింది. దీనికి ప్రత్యేకంగా కొన్ని కేటగిరీల రోగులను ఎంపిక చేసుకుని పరిశీలించి ఆ నివేదికను విడుదల చేసింది.

అన్ని అవయవాలపైనా ప్రభావం...
మొదటి దశ కోవిడ్‌ వ్యాప్తి సమయంలో ఎక్కువ మంది శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫె„క్షన్‌ రావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. కానీ, రెండో దశ తీవ్రత ఎక్కువగా ఉంది. ఊపిరితిత్తులతో పాటు మూత్రపిండాలు, కాలేయం, మెదడు తదితర కీలకమైన అవయవాలపై వైరస్‌ ప్రతాపాన్ని చూపింది. వీలైనంత ఎక్కువ మార్గాలను ఏర్పాటు చేసుకుని వైరస్‌ వ్యాప్తి చెందిన శరీరాన్ని గుల్ల చేసింది. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో మూత్రపిండాలపై ప్రభావం ఆరు రెట్లు అధికంగా ఉంది. కాలేయంపై చూపిన ప్రభావం గతేడాది కంటే రెండు రెట్లు ఎక్కువ. లివర్‌లోకి వైరస్‌ వ్యాప్తి చెందడంతో ఆ అవయవం విడుదల చేసే ఎంజైమ్స్‌ రెట్టింపు చేసి సామర్థ్యాన్ని తగ్గించినట్లు గుర్తించారు.

దేశంలో కోవిడ్‌ బారినపడ్డ 70 శాతం మందిలో డెల్టా వేరియంట్‌ ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. బి.1.617.2 రకానికి చెందిన ఈ వేరియంట్‌ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. డెల్టా వేరియంట్‌ తెల్ల రక్తకణాల్లోని లింపోసైట్‌లపై తీవ్ర ప్రభావం చూపడంతో ఎక్కువ మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ వేరియంట్‌ వైరస్‌ వ్యాప్తిని ముందుగా లక్షణాలతో గుర్తించి చికిత్స తీసుకున్న వారు ఇంటివద్దే కోలుకుంటుండగా... కాస్త నిర్లక్ష్యం చేసినా ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. దీని నియంత్రణకు వైద్యులు శ్రమించాల్సి వస్తోంది.

మొదటి దశ, రెండో దశలో సివియర్‌ పేషంట్లలో పరిస్థితి ఇలా(గణాంకాలు శాతాల్లో)...
కేటగిరీ                మొదటి దశ    రెండో దశ
ఎస్‌పీఓ2 సగటు        92        85.5
ఫీవర్‌                      30        85
దగ్గు                       14        78
గొంతులో గరగర        11        05
దమ్ము                   15        80
నీరసం                   9.5       19.6
లూస్‌మోషన్స్‌           11        5

► మొదటిదశ చికిత్సలో స్టెరాయిడ్లను 4 శాతం మందికే వాడగా... రెండో దశకు వచ్చే సరికి 72 శాతం మందికి ఇచ్చారు. ఇక యాంటిబయోటిక్స్‌ వినియోగం రెట్టింపు అయ్యింది. 
►బాక్టీరియల్‌ న్యుమోనియా 1.1 శాతం నుంచి 9 శాతానికి పెరగగా, సివియర్‌ వైరస్‌ న్యుమోనియా 6 శాతం నుంచి ఏకంగా 49 శాతానికి ఎగబాకింది.
►సీటీ స్కాన్‌లో స్కోర్‌ గతేడాది కంటే ఈసారి భారీగా పెరుగుదల నమోదైంది.

  • డెల్టా వేరియంట్‌ వ్యాప్తి చెందిన ఎక్కువ మందిలో ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపడంతో ఆక్సిజన్‌ స్థాయిలు భారీగా పడిపోయాయి. కరోనా తొలి దశలో 12 శాతం మందికే ఆక్సిజన్‌ సప్లిమెంట్‌ అవసరంపడగా... రెండో దశలో ఏకంగా 82 శాతానికి పెరిగింది.
  • రెమిడెసివిర్‌ వినియోగం మొదటి దశలో ఒక శాతం కంటే తక్కువ ఉండగా... ప్రస్తుతం ఆస్పత్రిలో చేరిన 12 శాతం మంది వినియోగించారు.
  • సివియర్‌ కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరిన వారిలో గతేడాది 90 శాతం మంది డిశ్చార్జ్‌ కాగా.. సెకండ్‌ వేవ్‌లో 71శాతం మందే డిశ్చార్జ్‌ అయినట్లు గుర్తించారు. ఈ లెక్కన మొదటి దశలో నమోదైన మరణాల రేటుతో పోలిస్తే రెండో దశలో మరణాల రేటు మూడు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.
  • గతేడాది ఆస్పత్రుల్లో చేరిన వారిలో 2.6 శాతం మందికే వెంటిలేటర్‌ అవసరపడగా ఈసారి 41 శాతానికి పెరిగినట్లు పరిశీలనలో తేలింది.

    పరిశోధన సాగిందిలా...

మొదటి దశ కోవిడ్‌కు సంబంధించి గత ఏడాది ఏప్రిల్, మే, జూన్‌లలో ఎయిమ్స్‌లో అడ్మిట్‌ అయిన 106 మంది రోగులు.. రెండో దశ తీవ్రంగా ఉన్న ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మేలో చేరిన 104 మందిపై పరిశీలన చేశారు. మైల్డ్, మోడరేట్, సివియర్‌ కేటగిరీలుగా కోవిడ్‌ను విభజించి.. వీరిలో వైరస్‌ చూపిన ప్రభావం, అందించిన చికిత్సను పరిశీలించారు. తొలి దశలో లక్షణాలు లేకున్నా ఆస్పత్రుల్లో చేరగా.. ప్రస్తుతం మోడరేట్‌ స్టేజి దాటే క్రమం, సివియారిటీకి వచ్చిన తర్వాతే ఆస్పత్రుల్లో చేరారు. . తొలిదశలో 37.5%  మందే ఆస్పత్రుల్లో చేరగా.. ప్రస్తుతం 70% మంది చేరారు. గతేడాది ఆస్పత్రుల్లో చేరిన వారి సగటు వయసు 37 యేళ్లు కాగా, ప్రస్తుతం 50.5 యేళ్లు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2022
May 08, 2022, 17:43 IST
కెవాడియా(గుజరాత్‌): కోవిడ్‌ మహమ్మారి వల్ల భారత్‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)...
03-05-2022
May 03, 2022, 03:08 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 12 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 80.82 శాతం...
02-05-2022
May 02, 2022, 03:12 IST
సాక్షి, అమరావతి: కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే టీకాలు అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పబ్లిక్‌ హెల్త్‌...
24-04-2022
Apr 24, 2022, 11:03 IST
కన్న తండ్రిని కాపాడుకునేందుకు పడిన వేదన.. ఆస్పత్రి సేవల కోసం చేసిన శోధన.. అంటరాని వాళ్లను చేసి అందరూ దూరం...
21-04-2022
Apr 21, 2022, 11:52 IST
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్‌ విజృంబిస్తోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2380...
20-04-2022
Apr 20, 2022, 13:36 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి....
18-04-2022
Apr 18, 2022, 15:39 IST
వైద్య నిపుణుల ఊహ కంటే ముందే భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పెరుగుతున్న కేసుల్ని...
17-04-2022
Apr 17, 2022, 13:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1150 కొత్త కేసులు నమోదుకాగా.....
16-04-2022
Apr 16, 2022, 13:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. మరోవైపు భారత్‌లో కూడా...
11-04-2022
Apr 11, 2022, 01:28 IST
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవాళ్లలో రక్తం గడ్డకట్టడం, చిక్కబడడం పెరిగి ప్రమాదాలకు దారి...
06-04-2022
Apr 06, 2022, 18:09 IST
ముంబై: రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. వైరస్‌ కట్టడికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపం మార్చుకొని...
06-04-2022
Apr 06, 2022, 15:27 IST
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే...
06-04-2022
Apr 06, 2022, 05:09 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 16,267 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 30మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో...
27-03-2022
Mar 27, 2022, 21:30 IST
చైనాలో కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నకరోనా కేసులు. పరిస్థితి అంత తేలిగ్గా అదుపులోకి వచ్చే స్థితి ఏ మాత్రం కనబడటం లేదు.
21-03-2022
Mar 21, 2022, 12:59 IST
ఫోర్త్‌ వేవ్‌ రూపంలో కాకున్నా జూన్, జూలై నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు గాంధీ ఆస్పత్రి...
28-02-2022
Feb 28, 2022, 09:43 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా కోవోవ్యాక్స్‌ను బూస్టర్‌ డోస్‌గా వాడేందుకు వీలుగా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ డీసీజీఐ...
28-02-2022
Feb 28, 2022, 08:26 IST
హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు...
24-02-2022
Feb 24, 2022, 14:35 IST
పూర్తిస్థాయిలో కరోనా ముప్పు తొలగిపోలేదని.. వేవ్‌ రాకున్నా, వేరియంట్లు ఉన్నాయని ప్రొఫెసర్‌ రాజారావు అభిప్రాయపడ్డారు.
19-02-2022
Feb 19, 2022, 07:42 IST
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ డ్రాప్స్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్‌లో ప్రారంభించినట్టు...
17-02-2022
Feb 17, 2022, 18:38 IST
కోవిడ్‌ వైరస్‌ సోకి కోలుకుని అస్సలు టీకాలు తీసుకోని వారిలో దీర్ఘకాలం పాటు కరోనా సమస్యలు, లక్షణాలు కొనసాగుతున్నట్టు వెల్లడైంది. ... 

Read also in:
Back to Top