ఢిల్లీ క్రైమ్‌ చిత్రానికి అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు

Delhi Crime Wins International Emmy Award For Best Drama Series - Sakshi

న్యూఢిల్లీ‌: దేశ రాజధానిలో 2012లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'ఢిల్లీ క్రైమ్'‌ చిత్రం 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు ఎంపికైంది. ఈ చిత్రం ఉత్తమ నాటక ధారావాహిక విభాగంలో అవార్డు అందుకోనుంది. అంతరర్జాతీయ వేదిక వద్ద భారతీయ వెబ్‌ సిరీస్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను గుర్తించే పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌గా  షెఫాలి షా నటించారు.  (‘ప్రాణం’ కమలాకర్‌ పాట ఏడు భాషల్లో..)

ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు రిచీ మెహతా మాట్లాడుతూ... ఎంతో మంది నుంచి వేధింపులు, హింసను భరిస్తూ... అలాంటి సమస్యల పరిష్కారినికి కృషి చేస్తున్న మహిళలందరికి ఈ అవార్డు అంకితమిస్తున్నా. చివరగా, అలసిపోని తల్లి, ఆమె కుమార్తె గురించి ఆలోచించకుండా ఆరోజు గడిచిపోదు. మనలో ఎవరూ వాళ్ల గురించి మరిచిపోరని నేను నమ్ముతున్నానని అన్నారు.

అవార్డులు..
ఉత్తమ నటుడి విభాగంలో (అర్జున్ మాథుర్, మేడ్ ఇన్ హెవెన్), ఉత్తమ కామెడీ సిరీస్ (ఫోర్ మోర్ షాట్స్‌ ప్లీజ్) లో కూడా భారత్ నామినేషన్లు సాధించింది. ఈ అవార్డులు వరుసగా మరోసారి నటుడు బిల్లీ బారట్, (రెస్పాన్సిబుల్ చైల్డ్), నింగూమ్ టా ఓల్హాండో (నోబడీ లుకింగ్) సొంతం చేసుకున్నారు.

ఇతర ప్రధాన విభాగాలలో, గ్లెండా జాక్సన్ (ఎలిజబెత్ ఈజ్ మిస్సింగ్) ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన వెర్టిగే డి లా చుట్ (రెస్సాకా) ఉత్తమ ఆర్ట్స్ ప్రోగ్రామింగ్ అవార్డును గెలుచుకోగా, రెస్పాన్సబుల్‌ చైల్డ్ ఉత్తమ మినీ-సిరీస్ అవార్డును గెలుచుకుంది. కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా న్యూయార్క్లోని ఖాళీ థియేటర్లో ఈ వేడుక జరగగా, రిచర్డ్ కైండ్ విజేతలకు అవార్డులను అందించారు.

విజేతల జాబితా..
ఉత్తమ డ్రామా సిరీస్: ఢిల్లీ క్రైమ్ (ఇండియా)
ఉత్తమ కామెడీ సిరీస్: నింగుమ్ టా ఓల్హాండో (నోబడీ లుకింగ్) (బ్రెజిల్)
ఉత్తమ టీవీ మూవీ / మినీ-సిరీస్: రెస్పాన్సిబుల్ చైల్డ్‌ (యునైటెడ్ కింగ్‌డమ్)
ఉత్తమ నటి: గ్లెండా జాక్సన్, ఎలిజబెత్ ఈజ్ మిస్సింగ్ (యునైటెడ్ కింగ్‌డమ్)
ఉత్తమ నటుడు: బిల్లీ బారట్, రెస్పాన్సిబుల్ చైల్డ్‌ (యునైటెడ్ కింగ్‌డమ్)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top