
హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్‌పో–2022ను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తదితరులు
మాదాపూర్: రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం రెండు రోజుల పాటు నిర్వహించనున్న టైమ్స్ ప్రాపర్టీ హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్‌పో–2022ను ఆయన నిర్వాహకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెరా(తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) ను ప్రారంభించినప్పటి నుంచి 5299 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్‌లను తెలంగాణ ప్రభుత్వం క్లియర్ చేసిందన్నారు.
ప్రస్తుతం దేశంలో ఐదవ స్థానంలో ఉన్నామని, అతి త్వరలో మరింత ఉన్నత స్థానాన్ని చేరుకుంటామని చెప్పారు. నగరంలో నిరంతరం విద్యుత్ సదుపాయం ఉండడంతో ఇన్వర్టర్లు, జనరేటర్‌ల వ్యాపారం అంతరించిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిరంతరం అభివృద్ధి పనులు జరుగుతుండటంతో రియల్ రంగంలో హైదరాబాద్ టాప్‌గా నిలవనుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్‌బీఎల్ సీఈఓ అజితేష్ కొరుపోలు, మ్యాండేట్ ఎండీ బిస్వజిత్ పట్నాయక్, రాంకీ ఎండీ నందకిషోర్, కాన్సెప్ట్ అంబెన్స్ డైరెక్టర్ ముకుల్ అగర్వాల్, క్రెడాయ్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.