
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 5,559 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. గత 24 గంటల్లో 8,061 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 4,13,225 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 71,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బెలెటిన్ విడుదల చేసింది.