తెలంగాణలో 1682 కేసులు, 8 మంది మృతి | Coronavirus: 1682 Positive Cases Reported In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 1682 కేసులు, 8 మంది మృతి

Aug 18 2020 9:15 AM | Updated on Aug 18 2020 7:14 PM

Coronavirus: 1682 Positive Cases Reported In Telangana - Sakshi

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 19,579 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1682 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

సాక్షి, హైదరాబాద్‌: గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 19,579 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1682 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 93,937 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా 8 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 711 కు చేరింది. మంగళవారం 2070 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 72,202 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 21,024 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌లో పేరొంది. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 7,72,928 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది. రికవరీ రేటు 76.86% ఉందని వెల్లడించింది.


(24 గంటల్లో భారత్‌లో 55,079 పాజిటివ్‌)


 

Advertisement
 
Advertisement
Advertisement