కోవిడ్‌ టీకాల కోసం పరుగులు.. మీరు క్యూలో ఉన్నారు!

Corona: Hyderabad People In Line InFront Of Vaccine Centers - Sakshi

సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్‌

స్లాట్‌ బుక్‌ చేసుకున్నా.. లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా గ్రేటర్‌లో మళ్లీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఒకవైపు పాజిటివ్‌ కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవుతుండగా...మరో వైపు కోవిడ్‌ మరణాలు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే 1734 మంది కోవిడ్‌తో చనిపోగా...తాజాగా మరో ఐదుగురు మృతి చెందారు. బుధవారం అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలో 393, రంగారెడ్డిలో 169, మేడ్చల్‌లో 205 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక వైరస్‌ బారినుంచి బయటపడాలంటే టీకా ఒక్కటే ప్రత్యామ్నాయమని భావించి, ఆ మేరకు జనం టీకా కేంద్రాల వెంట పరుగులు తీస్తున్నారు. సామర్థ్యానికి మించి లబ్ధిదారులు వస్తుండటంతో ఆయా కేంద్రాలన్నీ రద్దీగా మారుతున్నాయి. మరోవైపు టీకా కేంద్రాల వద్ద తాగేందుకు మంచినీరు, కుర్చీలు, టెంట్లు వంటి సరైన మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

స్లాట్‌బుక్‌ చేసుకున్నా..
జనవరి 16న తొలి విడత టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. మొదట్లో హెల్త్‌కేర్‌ వర్కర్లకు టీకాలు వేశారు. ఆ తర్వాత రెండో విడతలో పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులకు వేశారు. మూడో విడతలో 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్‌ వేశారు. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిని ప్రతి ఒక్కరికి టీకాలు వేస్తున్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ టీచింగ్‌ ఆస్పత్రులు సహా పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో టీకాలు వేస్తున్నారు. వీటితో పాటు మరో 195 కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ టీకాలు వేస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో వంద మంది చొప్పున రోజుకు సగటున 30 వేల మందికి టీకాలు ఇస్తున్నారు.

చదవండి: సెకండ్‌ వేవ్‌: సర్జరీలకు కరోనా బ్రేక్‌!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా టీకా వేస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.300 ఛార్జీ చేస్తున్నారు. వ్యాక్సిన్‌ పనితీరుపై ఉన్న అపోహలతో కొంత మంది మొదట్లో టీకాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రాణాలను కాపాడుకునేందుకు టీకాల కోసం పరుగులు తీస్తున్నారు. ఎంపిక చేసిన కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన టీకాల సామర్థ్యం కంటే ఎక్కువగా లబ్ధిదారులు వస్తున్నారు. కోవిన్‌ యాప్‌లో ముందే స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారు కూడా కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.  

గాంధీలో కరోనా పడకల సంఖ్య పెంపు  
గాంధీఆస్పత్రి: కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల కోసం పడకల సంఖ్య పెంచినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 182 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. బాధితుల కోసం 300 కరోనా ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉండగా, మరో 200 ఆక్సిజన్‌ బెడ్లు అదనంగా ఏర్పాటు చేశామన్నారు. గాంధీలో కోవిడ్, నాన్‌కోవిడ్‌ రెండు రకాల వైద్యసేవలు అందు బాటులో ఉన్నాయని, బుధవారం 1501 మంది ఓపీ రోగులకు వైద్యం అందించామన్నారు. ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లతోపాటు కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.   

చదవండి: బేగంబజార్‌కు కరోనా ఎఫెక్ట్.. టైమింగ్స్ చేంజ్!‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-04-2021
Apr 08, 2021, 13:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో  రెండో దశలో  కరోనా కేసులు  రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.  తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా రోజువారీ...
08-04-2021
Apr 08, 2021, 11:47 IST
సాక్షి,న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా సంస్థ తమకు లీగల్‌ నోటీసు జారీ చేసిందని కరోనా వైరస్‌ టీకా ‘కోవిషీల్డ్‌’ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌...
08-04-2021
Apr 08, 2021, 11:43 IST
సాక్షి, అబిడ్స్‌(హైదరాబాద్‌): బేగంబజార్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. బేగంబజార్‌లో 100 మందికిపైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అ‍య్యింది. దీంతో రాష్ట్రంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన...
08-04-2021
Apr 08, 2021, 06:23 IST
చెన్నై: ఐపీఎల్‌ను కరోనా వైరస్‌ వదలడం లేదు. తాజాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్‌ డానియెల్‌ సామ్స్‌ పాజిటివ్‌గా...
08-04-2021
Apr 08, 2021, 06:13 IST
సాక్షి, న్యూఢిల్లీ:  కారులో ఒక్కరే ప్రయాణిస్తున్నప్పటికీ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని బుధవారం ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. వాహనం బహిరంగ ప్రదేశాల...
08-04-2021
Apr 08, 2021, 04:38 IST
సాక్షి, అమరావతి: ‘కరోనా బారినపడి కోలుకున్న తరువాత కూడా వివిధ అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంది. కాబట్టి కరోనా...
08-04-2021
Apr 08, 2021, 04:20 IST
కరోనా మహమ్మారి మళ్లీ మరోసారి మనందరినీ విపరీతంగా భయపెడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ దాకా...
08-04-2021
Apr 08, 2021, 03:16 IST
ముంబై: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యతోపాటుటీకాల కొరత పెరిగిపోతోందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్‌ టోపే ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలో...
08-04-2021
Apr 08, 2021, 02:41 IST
వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే...
08-04-2021
Apr 08, 2021, 02:16 IST
సావోపాలో: బ్రెజిల్‌లో మొదటిసారిగా ఒకే రోజులో 4 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 4,195 మంది...
08-04-2021
Apr 08, 2021, 02:04 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విస్ఫోటనం దడ పుట్టిస్తోంది. మూడు రోజుల తేడాలో మరోసారి రికార్డు స్థాయిలో లక్షకి పైగా కేసులు...
08-04-2021
Apr 08, 2021, 01:43 IST
సాక్షి, హైదరాబాద్‌: సీరియస్‌ కరోనా రోగులకే ఆసుపత్రుల్లో పడకలు కేటాయించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. సాధారణ లక్షణాలతో కరోనా...
07-04-2021
Apr 07, 2021, 20:04 IST
మా దేశంలో ఒక్కటంటే ఒక్క కరోనా కేసు రాలేదు. పరీక్షలు 23 వేలకు పైగా చేయగా అందరికీ నెగటివ్‌
07-04-2021
Apr 07, 2021, 19:30 IST
రోజులు గడిచేకొద్దీ వ్యాక్సిన్‌ వేసుకోవాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.
07-04-2021
Apr 07, 2021, 19:15 IST
అగర్తాల: కరోనా వైరస్‌ బారిన మరో ముఖ్యమంత్రి పడ్డారు. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌కు తాజాగా కరోనా వైరస్‌...
07-04-2021
Apr 07, 2021, 17:38 IST
దేశ రాజధాని ఢిల్లీలో విధించిన నైట్‌ కర్ఫ్యూ సమయంలో సామాన్య ప్రజలను ఇళ్ల నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతించరు.
07-04-2021
Apr 07, 2021, 17:32 IST
ఛత్తీస్‌గడ్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
07-04-2021
Apr 07, 2021, 13:57 IST
కన్నడనాట రెండోదఫా కోవిడ్‌ పంజా విసురుతోంది. రోజూ డిశ్చార్జిల కంటే యాక్టివ్‌ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది.
07-04-2021
Apr 07, 2021, 13:38 IST
దొడ్డబళ్లాపురం: ఇంట్లో వారికి కరోనా సోకినందున కచ్చితంగా కోవిడ్‌ నియమాలను పాటించాలని ప్రభుత్వాలు, కోర్టులు ఆదేశించినా రాజకీయ నాయకులే పెడచెవిన...
07-04-2021
Apr 07, 2021, 08:09 IST
సాక్షి, ముంబై: ముందుకు నిశ్చయించుకున్న ప్రకారం పెళ్లిలు నిర్వహించుకోవాలంటే స్థానిక పోలీసుస్టేషన్‌ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని బీఎంసీ అదనపు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top