హైడ్రా చట్టబద్దమైనదే.. త్వరలో మరిన్ని అధికారాలు: రంగనాథ్‌ | Commissioner Ranganath Key Comments Over HYDRA | Sakshi
Sakshi News home page

హైడ్రా చట్టబద్దమైనదే.. త్వరలో మరిన్ని అధికారాలు: రంగనాథ్‌

Sep 14 2024 4:19 PM | Updated on Sep 14 2024 5:48 PM

Commissioner Ranganath Key Comments Over HYDRA

సాక్షి, హైదరాబాద్‌: హైడ్రాపై తెలంగాణ హైకోర్టు పలు ప్రశ్నలు సంధించిన వేళ కీలక వ్యాఖ్యలు చేశారు కమిషన్‌ రంగనాథ్‌. హైడ్రా చట్టబద్దమైనదే అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, అక్టోబర్‌లోపు హైడ్రాకు సంబంధించి ఆర్డినెన్స్‌ వస్తుందన్నారు.

కాగా, హైడ్రా అంశంపై తాజాగా కమిషనర్‌ రంగనాథ్‌ మాట్లాడుతూ.. త్వరలోనే హైడ్రాకు విశేష అధికారాలు వస్తాయి. హైడ్రా చట్టబద్దమైనదే. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ అక్టోబర్‌లోపు వస్తుంది. గ్రేహౌండ్స్‌, టాస్క్‌ఫోర్స్‌ తరహాలో హైడ్రా పనిచేస్తుంది. నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తాం’ అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాపై హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన జీవో 99 చ‌ట్ట‌బ‌ద్ద‌త‌ను స‌వాల్ చేస్తూ నానక్‌రామ్‌గూడకు చెందిన లక్ష్మీ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటషన్‌లో జీహెచ్ఎంసీ యాక్ట్ కాద‌ని హైడ్రాకు ఎలా అధికారాలు ఇస్తార‌ని ప్రశ్నించారు. హైడ్రా చ‌ట్ట‌బ‌ద్ద‌త‌ను ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న‌ర్ కోరారు. ఈ పిటిష‌న్‌ను జ‌స్టిస్ కే. ల‌క్ష్మ‌ణ్ శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టారు.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా కూల్చివేయ‌డంపై ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. వివ‌ర‌ణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తార‌ని ప్ర‌శ్నించారు. జీవో 99పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ప్ర‌భుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధతను ప్రశ్నించింది. ఈ క్రమంలో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను రెండు వారాల‌కు కోర్టు వాయిదా వేసింది.

హైడ్రా పై సీపీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ ప్రజలంటే సీఎం రేవంత్‌కు పగ: కేటీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement