కమర్షియల్‌ సిలిండర్‌ రూ.6 వేలు | Commercial Gas Cylinder Price Hike | Sakshi
Sakshi News home page

కమర్షియల్‌ సిలిండర్‌ రూ.6 వేలు

Mar 31 2026 7:56 AM | Updated on Mar 31 2026 7:56 AM

Commercial Gas Cylinder Price Hike

బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న డీలర్‌ భర్త 

దందా కోసమే జూబ్లీహిల్స్‌లో గోదాం ఏర్పాటు 

డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టి 10 మంది అరెస్టు 

∙ 414 సిలిండర్లు, 10 వాహనాలు సీజ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఏడాదిన్నరగా వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్న ఓ వ్యక్తి... పశ్చిమాసియా యుద్ధంతో నెలకొన్న కొరతను క్యాష్‌ చేసుకోసాగాడు. అతడి దందాపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం దాడి చేశారు. ప్రధాన నిందితుడు సహా పదిమందిని అరెస్టు చేసి, రూ.21 లక్షల విలువైన 414 సిలిండర్లు, పది వాహనాలు స్వా«దీనం చేసుకున్నట్టు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ తెలిపారు. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ యదేంధర్‌తో కలిసి  విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ప్రధాన నిందితుడు మొహమ్మద్‌ అమీర్‌ భార్య పేరుతో గ్యాస్‌ డీలర్‌షిప్‌ తీసుకుని అఫ్జల్‌గంజ్‌లో ‘మెట్రో గ్యాస్‌ ఏజెన్సీ’ నిర్వహిస్తున్నాడు. దీనికి శంషాబాద్‌లో భారీ గోదాం కూడా ఉంది. అయితే, బ్లాక్‌ మార్కెట్‌ దందాకు పథకం వేసిన అమీర్‌.. ఏడాదిన్నర క్రితం బంజారాహిల్స్‌ నాగార్జున సర్కిల్‌ సమీపంలోని ఓ ప్రార్థన స్థలం ప్రాంగణాన్ని నెలకు రూ.5 వేలకు అద్దెకు తీసుకున్నాడు. 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్రమంగా సిలిండర్లను నిల్వ ఉంచాడు. మొహమ్మద్‌ యూసుఫ్‌ను అక్కడ నియమించాడు. గ్యాస్‌ కోసం సంప్రదించే వ్యాపారులను ఈ ప్రాంతానికి వెళ్లమని సూచించేవాడు. ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం వాణిజ్య సిలిండర్‌ను రూ.2,100కు విక్రయించాలి. కానీ, కొన్ని రోజులు రూ.4 వేల చొప్పున అమ్మారు. ఇటీవల గ్యాస్‌ సంక్షోభం ఏర్పడడంతో రూ.6 వేలకు పెంచేశారు. యూసుఫ్‌ చాలాసార్లు రూ.500 అ«ధికంగా వసూలు చేశాడు. 

అమీర్‌.. సిలిండర్ల డెలివరీకి మొహమ్మద్‌ ఇస్మాయిల్, రామారావు, లోక్‌ కుమార్‌లను, మొహమ్మద్‌ సక్రుద్దీన్, మొహమ్మద్‌ ముంతాజ్‌ అన్సారీ, మొహమ్మద్‌ మినాజ్‌ అన్సారీ, రాజేష్‌ పాల్‌ను కూలీలు, డ్రైవర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. పది వాహనాల్లో రోజూ 30 నుంచి 40 సిలిండర్ల విక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై జూబ్లీహిల్స్‌ జోన్‌ టాస్‌్కఫోర్స్‌కు సమాచారం రాగా.. అమీర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి పథకం వేశారు. డెకాయ్‌ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు.

 వారం రోజులుగా అమీర్‌ను సంప్రదిస్తున్న పోలీసులు ఆరు సిలిండర్లు కావాలని అడుగుతున్నారు. రోజురోజుకు రేటు పెంచేస్తున్న అతడు సోమవారం సిలిండర్‌ రూ.6 వేలకు విక్రయించడానికి అంగీకరించి గోదాం చిరునామా ఇచ్చాడు. ఇన్‌స్పెక్టర్‌ యదేంధర్‌ నేతృత్వంలో టాస్‌్క ఫోర్స్‌ ఎస్సై డి.రవిరాజ్‌ తమ బృందంతో దాడి చేశారు. అమీర్‌కు గోదాం కోసం అద్దెకిచి్చన ప్రార్థనా స్థలం అధ్యక్షుడు రామ్‌రాజ్‌ సింగ్‌నూ అరెస్టు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement