
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వినాయక చవితి సందర్భంగా.. ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్‌వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు.
HYDERABAD UPDATE 🌧️ | 27 AUG, 8 AM
🔔 NON-STOP MODERATE RAINS to continue across HYDERABAD City for the NEXT 3 HOURS ⚠️⚠️⚠️
🌧️ Strong rain bands are moving straight from Medak towards Hyderabad.
📍 Kamareddy & Medak will continue to witness HEAVY DOWNPOURS.
➡️ Thankfully, the… pic.twitter.com/6RerpSc2OT— Hyderabad Rains (@Hyderabadrains) August 27, 2025
వినాయక చవతి ఉత్సవాలు మొదలైన నేపథ్యంలో వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు. మరోవైపు.. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.