పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

CM KCR Siddipet Visit Live Updates - Sakshi

సాక్షి, సిద్ధిపేట: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం సి‍ద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి రూ.45 కోట్లతో సిద్ధిపేట శివారులో నిర్మించనున్న ఐటీ టవర్ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో నాలుగు ఐటీ కంపెనీలు సిద్ధిపేట ఐటీ టవర్‌లో వారి సంస్థల ఏర్పాటుకు ఒప్పందాలను కుదుర్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో జోలాన్ టెక్నాలజీ, విసాన్ టెక్ ,ఎంబ్రోడ్స్ టెక్నాలజీ, సెట్విన్ కంపనీలు పాల్గొన్నాయి. అదే విధంగా మన పట్టణ ప్రగతిలో మన గౌరవం దక్కేలా ముస్తాబాద్ సర్కిల్లో మోడల్ టాయిలెట్లను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో​ మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఏంసీ ఛైర్మన్ పాలసాయిరాం, మున్సిపల్ కౌన్సిలర్ ప్రవీణ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సుడా వైస్ ఛైర్మన్ రమణాచారి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చదవండి: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు..

రైతు వేదిక ప్రారంభం
సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు పాల్గొన్నారు. రైతు వేదిక వద్ద గ్రామంలోని ప్రజలను కేసీఆర్ పలకరించారు. అదే విధంగా మిట్టపల్లి మహిళ గ్రూపు సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద పప్పు దినుసులను పరిశీలించారు.

మెడికల్‌ కళాశాల ప్రారంభం
సిద్ధిపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ పర్యటనలో భాగంగా రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంత్రి హరీశ్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అదే విధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల అవరణలో రూ.225 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 960 పడకల ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.

సిద్ధిపేటలోని కోమటి చెరువు నెక్లెస్ రోడ్డును ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలినడకన సందర్శించారు. ఆయనతో పాటు మంత్రి హరీశ్‌రావు, పలువురు నేతలు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top